EPAPER

Vivo New Smartphones: వివో నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఇది మాములు అరాచకం కాదు భయ్య!

Vivo New Smartphones: వివో నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఇది మాములు అరాచకం కాదు భయ్య!

Vivo S19 and Vivo S19 Pro Launch: టెక్ మార్కెట్‌ వరుస మొబైల్ లాంచ్‌లతో బిజిబిజీగా మారింది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు గ్యాప్ లేకుండా కుప్పలు కుప్పలుగా ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొందనే చెప్పాలి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo కొత్త ఫోన్లను విడుదల చేయడానకి సిద్ధమైంది. తన S సిరీస్ నుంచి S19, S19 Pro ఫోన్లను తీసుకురానుంది. మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే అధికారిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఇన్‌సైడర్ డిజిటల్ చాట్ స్టేషన్ DCS ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.


Vivo S19 Specifications
Vivo S19 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో 4500 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో పవర్ కోసం 6000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.

Also Read: ఎవడ్రా వీడు.. రూ. 5వేలకే ఇన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్ లాంచ్ చేశాడు!


Vivo S19 Camera
Vivo S19 స్మార్ట్‌ఫోన్ కెమెరా కోసం ముందు భాగంలో OISతో 50MP GNJ 1/1.56-అంగుళాల ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో పాటు మెరుగైన క్లోజప్ షాట్‌లను క్యాప్చర్ చేయడంలో సహాయపడే సాఫ్ట్ లైట్ రింగ్‌ని కూడా కలిగి ఉంది. ఇతర ఫీచర్లతో పాటు ఫోన్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం NFCతో వస్తుంది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్షన్ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.

Vivo S19 Pro Specifications
S19 Pro కూడా 1.5K రిజల్యూషన్‌‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ కలిగి ఉంటుంది. ఈ ఫ్లాగ్‌షిప్ MediaTek డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో ఉంటుంది. బేస్ మోడల్ కంటే కొంచెం చిన్న 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కానీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

Also Read: హానర్ నుంచి ఆల్‌రౌండర్ ఫోన్.. ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Vivo S19 Pro Camera
Vivo S19  Pro OIS సపోర్ట్‌తో 50MP Sony IMX921 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో టెలిఫోటో కోసం OISతో 50MP IMX816 సెన్సార్ ఉంటాయి. టెలిఫోటో లెన్స్ 50x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. S19 Pro వెనుక భాగంలో స్మూత్ లైట్ రింగ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఈ ఫోన్ నీటిలో తడిసిన తర్వాత కూడా పని చేస్తుంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×