EPAPER

Vivo V40 Series: మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీతో వచ్చేస్తుంది.. ఇక చెడుగుడే..!

Vivo V40 Series: మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీతో వచ్చేస్తుంది.. ఇక చెడుగుడే..!

Vivo V40 Series Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివోకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సామాన్యుల టేస్ట్‌కి తగ్గట్టుగా బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చాలా ఫోన్లను రిలీజ్ చేసి ఫుల్ క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరో సిరీస్‌ను పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ తన లైనప్‌లో ఉన్న Vivo V40 సిరీస్‌ను త్వరలో భారతదేశంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన Vivo V30 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తుందని భావిస్తున్నారు.


Vivo నుంచి రాబోయే ఈ హ్యాండ్‌సెట్ లైనప్‌లో V40, V40 ప్రో అనే రెండు మోడల్‌లు ఉంటాయని తెలుస్తోంది. వీటిలో వనిల్లా మోడల్ గత నెలలోనే యూరప్ మార్కెట్లోకి విడుదలైంది. Vivo V40 Pro ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇది భారతదేశంలో త్వరలో ప్రారంభం కాబోతుందని సూచించింది. Vivo V40 సిరీస్ 5,500mAh బ్యాటరీతో ఆగస్టులో భారతదేశంలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు. ఇది దాని విభాగంలో ‘సన్నని ఫోన్’ గా పరిగణించబడుతుంది.

ఈ రెండు మోడళ్లు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో పరిచయం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది కాకుండా Vivo నుంచి రాబోయే ఈ హ్యాండ్‌సెట్‌లో 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ మద్దతుతో జీస్ ఆప్టిక్స్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. రెండు హ్యాండ్‌సెట్‌లు మెరుగైన పనితీరు కోసం మరెన్నో ఫీచర్లను కలిగి ఉండవచ్చని సమాచారం.


Also Read: ప్రపంచపు అతిచిన్న 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 100MP కెమెరా దీని సొంతం..!

కాగా Vivo V40 ఇప్పటికే రిలీజ్ అయిన యూరోపియన్ వెర్షన్ మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. Vivo V40 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Vivo V40 గ్లోబల్ మార్కెట్‌లో 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తో విడుదల చేయబడింది. ఇది 2,800 x 1,260 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ని కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC ద్వారా ఆధారితం అయింది. Adreno 720 GPUతో వస్తుంది. 12GB వరకు LPDDR4X RAM + 512GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.

ఫోన్ Android 14-ఆధారిత FuntouchOS 14తో వస్తుంది. Vivo V40 Ziess ఆప్టిక్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెకండరీ 50-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. వెనుక కెమెరా సిస్టమ్ ఆరా లైట్ యూనిట్‌తో వస్తుంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో ఫ్రంట్ ఫేసింగ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Vivo V40.. 80W వైర్డ్ ఫ్లాష్‌ఛార్జ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది దుమ్ము – నీటి రక్షణ కోసం IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×