EPAPER

Vivo T3 Ultra: వివో నుంచి బ్లాక్‌బస్టర్ ఫోన్.. 3డి కర్వ్డ్ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీతో లాంచ్‌కు రెడీ, ఎప్పుడంటే?

Vivo T3 Ultra: వివో నుంచి బ్లాక్‌బస్టర్ ఫోన్.. 3డి కర్వ్డ్ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీతో లాంచ్‌కు రెడీ, ఎప్పుడంటే?

Vivo T3 Ultra Launching Date: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అంచెలంచెలుగా దూసుకుపోతున్న కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది వివో అనే చెప్పాలి. ప్రతి సిగ్మెంట్‌లోనూ పరుగులు పెడుతోంది. సామాన్యులకు అందుబాటు ధరలో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేసి ఎక్కువగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ కంపెనీ ఫోన్లు ముఖ్యంగా కెమెరాకి ప్రజాదరణ పొందాయి. ఎంతటి బడ్జెట్ ఫోన్‌లో అయినా కెమెరా క్వాలిటీ అదిరిపోతుంది. అందువల్లనే ఈ కంపెనీ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక త్వరలో ఈ కంపెనీ భారతదేశంలో మరో మోడల్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది.


కంపెనీ Vivo T3 Ultra పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో సెప్టెంబర్ 12న లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అనంతరం ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్‌కి అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఫోన్ లాంచ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఫోన్‌కి సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. Vivo T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇది MediaTek డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 1.5K రిజల్యూషన్‌తో AMOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది. Vivo T3 అల్ట్రా ఫోన్ భారతదేశంలో Vivo T3 ప్రో అండ్ Vivo T3 5Gతో రాబోతుంది.

Also Read:  చెమటలు పట్టిస్తున్న ఫోన్.. చీప్ ధరకే 6GB ర్యామ్, AI ఫీచర్లు, 108MP కెమెరా ఫోన్, వదలకండి!


Vivo T3 Ultra కెమెరా విషయానికొస్తే.. Vivo అండ్ Flipkart రెండూ తమ వెబ్‌సైట్‌లో Vivo T3 Ultra స్పెసిఫికేషన్‌లను ఇవాళ తెలుపుతూ టీజర్ రిలీజ్ చేశాయి. వీటి ప్రకారం.. ఈ ఫోన్ భారతదేశంలో రూ.33,000లోపు ధరలో ఉన్నట్లు వెల్లడైంది. అదే సమయంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రధాన కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని లిస్టింగ్ వెల్లడించింది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం Vivo T3 అల్ట్రా ఆటో ఫోకస్‌తో 50 మెగాపిక్సెల్ షూటర్‌ను కలిగి ఉంది. వెనుక, ముందు కెమెరాలు రెండూ 60fps (సెకనుకు ఫ్రేమ్‌లు) వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి.

లిస్టింగ్ ప్రకారం.. Vivo T3 Ultra ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మద్దతుతో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 9200+ SoCతో పాటు 12GB RAM + 256GB వరకు స్టోరేజ్‌తో నడుస్తుంది. ఆన్‌బోర్డ్ ర్యామ్‌ను 24GB వరకు విస్తరించడానికి వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. Vivo T3 అల్ట్రా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. Vivo T3 Pro 5G వలె రాబోయే మోడల్‌ 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

New Smartphone: కొత్త ఫోన్ లాంచ్.. రూ.10,000 లకే పొందొచ్చు, ఫీచర్లు బాగున్నాయ్!

HMD Skyline Launched: హెచ్‌ఎండీ నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్, ధర ఎంతంటే?

Big Stories

×