EPAPER

vivo T2x 5G @ Rs.6000: 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. రూ.18 వేల ఫోన్ రూ.6వేలకే!

vivo T2x 5G @ Rs.6000: 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. రూ.18 వేల ఫోన్ రూ.6వేలకే!


vivo T2x 5G @ Rs.6000: మార్కెట్‌లో వివో బ్రాండ్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయంటే ఫోన్ ప్రియులు ఎగబడి కొనేస్తుంటారు. అంతటి క్రేజ్ ఉంది ఈ వివో ఫోన్‌కి. ముఖ్యంగా ఈ ఫోన్‌ను కొనే ఉద్దేశం ఉన్నవారు దీని కెమెరాకు అట్రాక్ట్ అవుతారు.

ఈ కారణంగానే వివో నుంచి వస్తున్న ఫోన్లకు మంచి గిరాకి ఏర్పడింది. అయితే ఇప్పటికే వివో ఎన్నో సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అందులో వివో టి సిరీస్ ఒకటి. ఈ సిరీస్‌లో వివో టి1, వివో టి 2, వివో టి2 ఎక్స్ వంటి మోడళ్లను పరిచయం చేసింది.


వీటిని రూ.20,000 వేల లోపు లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్‌ను అంత ధర వద్ద కొనుక్కునేందుకు చాలా మంది ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ ఫోన్ ధర ఎప్పుడు తగ్గితే అప్పుడే కొనుక్కుందాం అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్.

READ MORE: రూ.53 వేలకే ఐఫోన్​ 15.. ఇదే సూపర్​ డీల్​! మిస్​ అవ్వకండి..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వివో టి సిరీస్‌లో ఇక మోడల్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్యానర్ ప్రకారం.. వివో టి2 ఎక్స్ 5జీ (vivo T2x 5G) మోడల్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ మొబైల్ అసలు ధర రూ.17,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10,999కే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో వివో కంపెనీ నుంచి మంచి మోడల్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇదొక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి.

కాగా దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. యూపీఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. వీటితో వివో టి2 ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

READ MORE: ఏంటి బాసూ ఈ డిస్కౌంట్.. రూ.19 వేల స్మార్ట్‌ఫోన్‌‌ ఇంత తక్కువ ధరకా..?

ఇవి కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాదాపు రూ.11,800లకే వివో టి2 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. ఈ ఫోన్ మిడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Tags

Related News

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Lunar Space Station: చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

Vivo Y19s Mobile: వివో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే !

Indian Mobile Number : భారత్​లో ఫోన్ నెంబర్లకు +91 కోడ్ ఇచ్చింది అందుకే – ఈ విషయాలు మీకు తెలుసా?

Top IT Companies : యాపిల్, గూగుల్​ టు ఫేస్​బుక్​, ఇన్​స్టా – ఈ 8 బడా సంస్థల అసలు పేర్లు తెలుసా?

Readmi Note 13 5G : 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ – ఓరి బాబాయ్​.. రూ.14 వేలకే బ్రాండెడ్​​ స్మార్ట్ ఫోన్​

Redmi A4 5G : రెడ్ మీ అరాచకం.. స్నాప్ డ్రాగన్ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ మెుబైల్ మరీ అంత చీపా!

Big Stories

×