EPAPER

iQoo Z9s Series Launch Date: ఐక్యూ నుంచి మరో సిరీస్.. లాంచ్ సమయం వెల్లడించిన కంపెనీ సీఈఓ..!

iQoo Z9s Series Launch Date: ఐక్యూ నుంచి మరో సిరీస్.. లాంచ్ సమయం వెల్లడించిన కంపెనీ సీఈఓ..!

iQoo Z9s Series Launch Date: వివో సబ్-బ్రాండ్ iQoo దేశీయ మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ హవా చూపిస్తుంది. ప్రముఖ కంపెనీలకు పోటీగా తన ఆదిపత్యాన్ని చెలాయించేందుకు  అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలో ఫోన్లను రిలీజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు భారతదేశానికి తన కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావడానికి సిద్ధమైంది. తాజాగా కంపెనీ దేశంలో iQoo Z9s సిరీస్ లాంచ్ డేట్‌ను ప్రకటించింది. కాగా iQoo కంపెనీ iQoo Z9s సిరీస్‌ను మాత్రమే ప్రస్తావించినప్పటికీ.. ఇది కనీసం రెండు మోడళ్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.


మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో iQoo Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన కొన్ని రోజుల తర్వాత కంపెనీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. iQoo ప్రస్తుతం దాని Z సిరీస్ లైనప్‌లో iQoo Z9 Turbo, iQoo Z9, iQoo Z9x, iQoo Z9x 5G వంటి అనేక మోడళ్లను అందిస్తోందని తెలుస్తోంది. కాగా iQoo ఇండియా CEO నిపున్ మరియా సోషల్ మీడియా ద్వారా భారతదేశంలో iQoo Z9s సిరీస్ లాంచ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అయితే అతడు కచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించనప్పటికీ వచ్చే నెల అంటే ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందని అధికారికంగా తెలిపాడు.

Also Read: మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీతో వచ్చేస్తుంది.. ఇక చెడుగుడే..!


కాగా ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీని ప్రకారం.. ఫోన్ వెనుక డిజైన్‌ను చూపిస్తుంది. ఇది వెనుక మాడ్యూల్ హౌసింగ్ మూడు కెమెరాలు, రింగ్-ఆకారపు LED లైట్‌తో కనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న iQoo Z9 ఫోన్‌లు డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు iQoo Z9s వెనుక డిజైన్.. iQoo Z9 5G, iQoo Z9x 5G డిజైన్ మాదిరి ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ ఫోన్లు ఈ సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. రాబోయే లైనప్‌లో కనీసం iQoo Z9s, iQoo Z9s ప్రో వంటి మోడల్‌లు ఉంటాయని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే లాంచ్ అయిన వెనిలా iQoo Z9 5G 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. అలాగే iQoo Z9x 5G 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. iQoo Z9 5G MediaTek డైమెన్సిటీ 7200 5G SoCలో నడుస్తుంది. అయితే iQoo Z9x 5G స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoCతో అమర్చబడి ఉంటుంది. రెండు ఫోన్‌లలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లు ఉన్నాయి. ఈ రెండూ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×