EPAPER
Kirrak Couples Episode 1

Vivo Y58 5G Launched: వారేవా ఏముంది.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

Vivo Y58 5G Launched: వారేవా ఏముంది.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

Vivo Y58 5G Launched: టెక్ మేకర్ Vivo కొత్త Y సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo Y58 5Gని భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. Vivo Y58 అనేది ప్రీమియం వాచ్ లాంటి డిజైన్‌తో కూడిన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. పీక్ బ్రైట్నెస్ సన్‌లైట్ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉందని Vivo పేర్కొంది. అలానే ఫోన్‌లో 6000 mAh బ్యాటరీ, 8GB RAM, 50 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.20,000 కంటే తక్కువగా ఉంటుంది. Vivo Y58 5G ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


ఫోన్ రెండు కలర్స్‌లో వస్తుంది. Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. దీని ధర రూ. 19,499. ఇది ఇప్పుడు Vivo eStoreలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. సుందర్‌బన్స్ గ్రీన్, హిమాలయన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో కంపెనీ దీనిని విడుదల చేసింది. ఈ ఫోన్ క్లాసిక్ సన్‌బర్స్ట్ రౌండ్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది ప్రీమియం స్మార్ట్‌వాచ్ లుక్‌లో కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇది ఫోన్‌ను డస్ట్, వాటర్ నుంచి రక్షిస్తుంది. ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Vivo Y58 5G  భారీ ర్యామ్‌తో బిగ్ అండ్ బ్రైట్ డిస్‌ప్లే పూర్తి HD+ (2408×1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1024 nits HBM బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేను ఫోన్ కలిగి ఉంది. ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌‌లో రన్ అవుతుంది. ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఇది 8GB LPDDR4X RAM+ 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 8GB వర్చువల్ RAMకి సపోర్ట్ ఇస్తుంది. మైక్రో SD కార్డ్‌తో దాని స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా FuntouchOS 14లో ఫోన్ రన్ అవుతుంది.


Also Read: మొదటి సేల్ స్టార్ట్.. ఒక్కసారిగా ఆఫర్లే ఆఫర్లు.. డీల్ మళ్లీ రాదు!

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ స్మార్ట్ డైనమిక్ లైట్‌తో పాటు f/1.8 ఎపర్చరు, 2 మెగాపిక్సెల్ బోకె లెన్స్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ AI పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉంది. ఫోన్ 6000mAh బ్యాటరీతో 44W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ TUV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. డస్ట్,వాటర్ రెసిస్టెన్స్ కోసం ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. డ్యూయల్ సిమ్, 5 జి, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, గ్లోనాస్, గెలీలియో, బీడౌ వంటి ఫీచర్లకు కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

Related News

Apple Product Offers : ఆండ్రాయిడ్ ఎందుకు దండగా.. ఏకంగా ఐఫోనే కొనేయండి, ఆ తేదీ నుంచి యాపిల్ పండగ ఆఫర్లు

Flipkart Credit Card Offers 2024 : ఈ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? చాలా చౌకగా షాపింగ్ చేసేయొచ్చు.. ఇలా చెయ్యండి చాలు

Google Pixel 8 price : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో కళ్లు చెదిరే ఆఫర్​ – గూగుల్ పిక్సల్​ 8 మరీ ఇంత తక్కువ ధరకా?

Best Gadgets Under 500 In Flipkart : ఇదేం సేల్ అయ్యా బాబు.. మరీ ఇంత చీపా.. రూ.500లోపే ఎన్ని గాడ్జెట్స్​ కొనొచ్చో!

iphone Fastest Delivery : ఐఫోన్ రాక్… కస్టమర్ షాక్.. జెట్ స్పీడ్ లో డెలివరీ!

Amazon Smart Tv Offers : ఓడియమ్మా ఇదెక్కడి ఆఫర్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై ఏకంగా 65% డిస్కౌంట్..!

How To Check iPhone Is Real Or Fake : ఐఫోన్ కొంటున్నారా? మరి అది ఒరిజినలా? ఫేకా.. అనేది ఇలా కనిపెట్టేయండి

Big Stories

×