EPAPER

Vivo V40 SE Launched: బడ్జెట్ ఫ్లాగ్‌షిప్.. వివో న్యూ స్మార్ట్‌ఫోన్.. మూములుగా లేదు!

Vivo V40 SE Launched: బడ్జెట్ ఫ్లాగ్‌షిప్.. వివో న్యూ స్మార్ట్‌ఫోన్.. మూములుగా లేదు!

Vivo V40 SE Launched: టెక్ మార్కెట్‌లో వివో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. తాజాగా కంపెనీ తన బ్రాండ్ నుంచి వివో V40 SE 4Gని విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది V40 సిరీస్‌లో వచ్చిన ఐదవ ఫోన్. ఈ లైనప్‌లో ఇప్పటికే వివో V40 5G, V40 Lite 5G, V40 SE 5G, V40 Pro 5G ఉన్నాయి. అయితే వివో ఇప్పుడు లాంచ్ చేసిన ఫోన్‌లో 5G సపోర్ట్ లేదు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 120 హెచ్‌జెడ్ అమ్లోడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యాయల్ రియల్ కెమెరా యూనిట్, 80 వాట్స్ రాపిడ్ ఛార్జింగ్ ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త 4G ఫోన్ ధర, ఫీచర్లు, తదితర వివరాలు తెలుసుకోండి.


Vivo V40 SE 4G Specifications
వివో ఈ కొత్త ఫోన్ వేగన్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉంటుంది. ఫోన్  పర్పుల్ ఎడిషన్ 7.99 మిమీ మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది. ఫోన్ 6.67-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేను పంచ్-హోల్ కటౌట్‌తో కలిగి ఉంది. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. సేఫ్టీ కోసం ఫోన్‌లో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

వివో V40 SE 4G స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB/256GB UFS 2.2 స్టోరేజ్, 80W రాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, 8GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఫోన్ Funtouch OS 14 ఆధారంగా Android 14లో రన్ అవుతుంది. సెల్ఫీల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.


ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా, ఫ్లికర్ సెన్సార్‌ ఉన్నాయి. ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4G VoLTE, 2.4GHz-5GHz Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, NFC, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. దీని ద్వారా వాటర్, డస్ట్ నుంచి ప్రొకక్ట్‌గా ఉంటుంది.

Also Read: Jio Bharat J1 4G: జియో సంచలనం.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చుక్కలే.. ధర మరీ ఇంత తక్కువా!

Vivo V40 SE 4G Price
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V40 SE 4G ధర విషయానికి వస్తే చెక్ రిపబ్లిక్‌లో 4,999 PLN అంటే (సుమారు రూ. 18,000)కు విడుదల చేశారు. ఇది క్రిస్టల్ బ్లాక్, లెదర్ పర్పుల్ వంటి కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ప్రస్తుతం ఇది ఆసియా మార్కెట్లలో లాంచ్ చేయబడుతుందా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. భారత్‌లో కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

Bsnl Recharge Plan: వావ్ అమేజింగ్.. ఇంత తక్కువ ధరకే అన్ని రోజుల వ్యాలిడిటీనా, రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయింది!

Honor Magic V3: బీభత్సం.. హానర్ ఏంటి భయ్యా ఒకేసారి ఇన్ని లాంచ్ చేసింది, ధర సహా పూర్తి వివరాలివే!

Realme 13 And 13+ 5G: దుమ్ముదులిపే స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మొదటి సేల్ షురూ, ఆఫర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Vivo T3 Ultra: కుమ్ముడే కుమ్ముడు.. ఏకదాటిగా దూసుకుపోతున్న వివో.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్!

Poco M7 Pro 5G: పోకో నుంచి మరో కిక్కిచ్చే ఫోన్.. సామాన్యుల కోసం వచ్చేస్తుంది మావా!

Vivo Y300 Pro: వివో నుంచి మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్.. కర్వ్డ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో లాంచ్!

Moto S50 Launched: మోటో మామ అదరగొట్టేశాడు.. 50MP కెమెరా సహా మరెన్నో అధునాతన ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్!

Big Stories

×