Limited Offer: చైనీస్ టెక్ మేకర్ వివో మొబైల్ ప్రియులకు శుభవార్త చెప్పింది. వివో తన బ్రాండ్ నుంచి విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Vivo V30 5Gపై భారీ డీల్ ప్రకటించింది. కంపెనీ వివో V40 త్వరలో లాంచ్ చేయబోతుంది. ఈ క్రమంలోనే వీ 30 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఇప్పుడు ఈ 5జీ ఫోన్ కొనుగోలుపై రూ.3,799 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఇది లిమిటెడ్ డీల్‌గా కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ జులై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, ధర తదితర వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Vivo V30 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మూడు మోడళ్లపై HDFC, SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ స్వైప్, EMI లావాదేవీలపై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు బ్రాండ్ 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందిస్తోంది. అలానే ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా ఉంది.
Also Read: This Week Launching Mobiles: ఈవారం లాంచ్ కానున్న ఫోన్లు.. టాప్ సిక్స్ ఇవే.. లిస్టుపై ఓ లుక్కేయండి!
Vivo V30 5G Offer
వివో V30 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 33,999గా ఉంది. అయితే ప్రస్తుత డిస్కౌంట్‌తో మీరు కేవలం రూ.30,600కే కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 256 GB మోడల్ ఆఫర్ తర్వాత రూ. 32,400కి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.35,999. ఉంది
అలానే 12 GB RAM + 256 GB స్టోరేజ్‌తో టాప్ వేరియంట్ 10 శాతం తగ్గింపుతో రూ. 34,200 వద్ద అందుబాటులో ఉంది. ఇది ఇంతకుముందు రూ. 37,999కి సేల్‌కి తీసుకొచ్చారు. ఈ ఆఫర్ ప్రస్తుతం Vivo E-స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ డీల్ జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను అండమాన్ బ్లూ, పీకాక్ గ్రీన్, క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
Vivo V30 5G ఫోన్ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కూడా మీరు ఫోన్ కొనుగోలుపై రూ.3,400 డిస్కౌంట్ పొందుతారు. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో 3 నుండి 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్ కూడా జూలై 31 వరకు మాత్రమే ఉంటుంది.
Vivo V30 5G Features
Vivo V30 ఫోన్ 6.78-అంగుళాల HD ప్లస్ AMOLED డిస్ప్లై కలిగి ఉంది. ఇది 2800 x 1260 పిక్సెల్ రిజల్యూషన్, HDR 10 ప్లస్, 120Hz రిఫ్రెష్ రేట్, 2800nits పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అదనంగా అల్ట్రా-స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఫోన్ త్వరగా హీట్ కాదు.
Also Read: Best Mobile Offer: రూ.776లకే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లాక్ ఆఫర్.. పిచ్చెక్కిస్తున్న కెమెరా!
ఇది 12 GB RAM +256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీనితో పాటు RAM 12 GB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది OIS, ఆరా లైట్ ఫీచర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ లెన్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్లో 5000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని అందించింది. ఇది ఛార్జింగ్ కోసం 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.