EPAPER
Kirrak Couples Episode 1

Best Phones Launched in September 2024: కిర్రాక్.. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన టాప్ ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Best Phones Launched in September 2024: కిర్రాక్.. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన టాప్ ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Top smartphones launching in September 2024: ప్రతి నెలా ఎన్నో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. పాత బ్రాండ్‌లే కాకుండా కొత్త బ్రాండ్‌లు సైతం రిలీజ్ అవుతున్నాయి. ఈ నెలలో కూడా ఎన్నో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌కి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అందులో వివో, శాంసంగ్, మోటో, ఇన్ఫినిక్స్ తదితర కంపెనీ ఫోన్లు ఉన్నాయి. ఇవి అధునాతన ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చాయి. కంపెనీలు ఖరీదైన ధర నుండి చౌక ధరల వరకు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. దీని బట్టి ఎవరైనా తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే మరి మీరు ఎలాంటి ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటున్నారో ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోండి.


Infinix Zero 40 5G

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల FHD+ 10-బిట్ AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ 5G 4nm ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఫోన్ 12GB RAMతో 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఇది 108MP వెనుక కెమెరా, OIS మద్దుతుతో 50MP 120° అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇక ఫోన్ సామర్థ్యం విషయానికొస్తే.. 45W వైర్డ్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను రూ. 27,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.


Realme P2 Pro 5G

Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల FHD+ కర్వ్డ్ Samsung OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. AI ప్రొటెక్షన్ ఉన్నాయి. 120 nits బ్రైట్‌నెస్ మోడ్‌ను పొందుతారు. ఫోన్‌లో Qualcomm Snapdragon 7S Gen 2 చిప్‌సెట్, గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU వంటివి ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB+128GB, 12GB+256GB, 12GB+512GB వేరియంట్‌లు ఉన్నాయి. అంతేకాకుండా Realme P2 Proలో 50MP LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా అందించారు. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, గేమింగ్ కోసం GT మోడ్, 4500mm2 టెంపర్డ్ VC+ 9943mm2 గ్రాఫైట్ 3D VC కూలింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్‌ను కేవలం రూ.21,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వీటిని భారీ తగ్గింపుతో కొనేయొచ్చు!

Motorola Edge 50 Neo

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల సూపర్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అందించారు. ఇందులో AI స్టైల్ లింక్, AI మ్యాజిక్ కాన్వాస్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ, 10MP సెకండరీ టెలిఫోటో, OISకి మద్దతిచ్చే 13MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ని కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4310mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను రూ. 23,999 ధరతో కొనక్కోవచ్చు.

Vivo T3 Ultra 5G

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవల లాంచ్ అయింది. ఇది 6.78 అంగుళాల AMOLED 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. MediaTek Dimensity 9200+ ప్రాసెసర్‌ని పొందుతోంది. ఇది 12GB RAM +256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. వర్చువల్ ర్యామ్‌ను 24GB వరకు పెంచవచ్చు. ఇక ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించబడింది. OIS మద్దతుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వెనుక కెమెరా సెటప్ అందించబడింది. అలాగే ఫోన్ ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఈ ఫోన్‌ను రూ.28,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Related News

Vodafone-Idea: వొడాఫోన్-ఐడియా వినియోగదారులకు మరోషాక్.. తగ్గిన రోజులు!

iQOO 13: ఐక్యూ నా మజాకా.. మార్కెట్‌లోకి మరో సరికొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Redmi Note 14 Series: కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్లు.. మార్కెట్‌లోకి దించుతున్న రెడ్‌మి!

Flipkart Big Billion Days sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వీటిని భారీ తగ్గింపుతో కొనేయొచ్చు!

Tecno Spark 30: అధునాతన ఫీచర్లతో టెక్నో కొత్తఫోన్ లాంచ్.. లుక్ వేరె లెవెల్ మావా!

Best Budget Laptops Under Rs 15000: చీపెస్ట్ ల్యాప్‌టాప్స్.. 5జీ ఫోన్ ధరకే కొనేయొచ్చు, ఫీచర్లు అదిరిపోయాయ్!

Big Stories

×