EPAPER

Top Camera Phones: టాప్ కెమెరా ఫోన్లు.. ఒక్క క్లిక్‌‌తో ఫోటో వేరే లెవెల్..!

Top Camera Phones: టాప్ కెమెరా ఫోన్లు.. ఒక్క క్లిక్‌‌తో ఫోటో వేరే లెవెల్..!

Top camera phones: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్ల కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అందులో మంచి కెమెరా క్వాలిటీ గల ఫోన్లను ఎక్కువగా కొంటున్నారు. మరి మీరు కూడా మిడ్‌రేంజ్ విభాగంలో కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? బడ్జెట్‌లో వినియోగదారులకు మంచి కెమెరా అనుభవాన్ని అందించే అనేక ఎంపికలు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ. 30,000 ధరలోపు ఉన్న టాప్ కెమెరా ఫోన్‌లు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, మల్టిపుల్ కెమెరా మోడ్‌లతో కూడిన మంచి మెయిన్ కెమెరాను అందిస్తాయి. కొన్ని మోడల్‌లు ప్రత్యేక టెలిఫోటో లెన్స్‌తో కూడా వస్తాయి. అందువల్ల అందుబాటు ధరలో ఉన్న బెస్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


Honor 200 5G

Honor 200 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. దీని బేస్ మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.34,999గా ఉంది. అయితే కొనుగోలుదారులు అన్ని బ్యాంకు కార్డులపై రూ. 3,000 బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్‌లతో కొనుగోలుదారులు దాదాపు రూ.30,000కి పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో 50MP OIS మెయిన్ లెన్స్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 12MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. ముందువైపు ఇది 50MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది.


Also Read: వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ లాంచ్‌కు సిద్ధం.. ఫోన్ మాత్రం యమ స్టైల్..!

OnePlus Nord 4

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌కి కూడా మార్కెట్‌లో ఆదరణ లభిస్తుంది. దీని ధర అమెజాన్‌లో రూ. 32,999గా ఉంది. అయితే కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌ని రూ. 30,000 లోపు కొనుగోలు చేయవచ్చు. ఇది 50MP OIS మెయిన్ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. వెనుక కెమెరా 60fps వరకు 4K వీడియోలను షూట్ చేయగలదు. సెల్ఫీలను క్లిక్ చేయడానికి ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. 6.74-అంగుళాల 120Hz ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ ఉన్నాయి.

Redmi Note 13 Pro+ 5G

Redmi Note 13 Pro+ 5G ఫోన్ కొంచెం పాతది అయినప్పటికీ కెమెరాలో బెస్ట్ ఫోన్‌గా నిలిచింది. దీని ధర రూ. 30,999గా అమెజాన్‌లో ఉంది. అయితే రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP Samsung ISOCELL HP3 OIS మెయిన్ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో యూనిట్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 16MP సెల్ఫీ స్నాపర్ ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల 120Hz 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×