EPAPER

What is e-SIM: ఈ-సిమ్ అంటే ఏమిటి..? దాన్ని ఎలా యాక్టివ్ చేయాలి..?

What is e-SIM: ఈ-సిమ్ అంటే ఏమిటి..? దాన్ని ఎలా యాక్టివ్ చేయాలి..?
e-SIM
e-SIM

What is e-SIM and How to Activate it: మీరు స్మార్ట్ ఫోన్ యూజర్ అయితే.. కచ్చితంగా ఈ సిమ్ గురించి తెలుసుకోవాలి. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా! ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఈ సిమ్ దే భవిష్యత్తు. ఈ సిమ్ అంటే ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది ఒక డిజిటల్ సిమ్ కార్డ్. కొంతకాలం క్రితం Apple తన iPhone-14, iPhone-14 ప్రో మోడల్‌లలో ఫిజికల్ సిమ్‌కు బదులుగా ఈ సిమ్ ఆప్షన్‌తో లాంచ్ చేసింది.


ఆ తర్వాత ఈ పదం చాలా చర్చనీయాంశమైంది. ఈ సిమ్‌లు ఒకప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు భారతదేశంలో ఈ సిమ్ ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. అయితే ఈ సిమ్ సెటప్ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు Airtel యూజర్ అయితే eSIMని ఎలా యాక్టివ్ చేయాలో చూద్దాం.

Also Read: రూ.8 వేల boAt స్మార్ట్ వాచ్ రూ.999కే..!


ముందుగా మీరు Airtel e-SIM డివైజ్‌కి సపోర్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి. దీని కోసం మీరు మీ సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సంప్రదించవచ్చు లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయవచ్చు.

e-Sim అంటే ఏమిటి?

ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్.  ఇది మీ డివైజ్‌లో ఉండే డిజిటల్ SIM కార్డ్. ఇది ఉంటే ఫిజికల్ సిమ్ కార్డ్ అవసరం ఉండదు.

ఫిజికల్ సిమ్‌ను ఈసిమ్‌గా మార్చడం ఎలా?

  1. మీరు ఇప్పటికే ఎయిర్‌టెల్ ఫిజికల్ సిమ్‌ని కలిగి ఉన్నట్లయితే.. మీరు ఈ స్టెప్స్‌ ఫాలో అయి దాన్ని eSIMకి మార్చవచ్చు.
  2. మీ నంబర్ నుండి eSIM <రిజిస్టర్ ఇమెయిల్ ID> అని 121కి SMS చేయండి.
  3. Airtel మీకు ధృవీకరణ మెసేజ్ పంపుతుంది.
  4. మీ అభ్యర్థనను నిర్ధారించడానికి ‘1’ నంబర్‌తో ఆ మెజేజ్‌కు రిప్లై ఇవ్వండి.
  5. ఆ తర్వాత, మీరు ఎయిర్‌టెల్ నుండి QR కోడ్‌తో కూడిన ఇమెయిల్‌ను అందుకుంటారు.
  6. eSIM యాక్టివేషన్ కోసం QR కోడ్‌ని స్కాన్ చేయండి.

Also Read: బుల్లి బుల్లీ ఏసీలు.. మీ ఇంటిని జిల్ జిల్ చేస్తాయి!

Androidలో Airtel eSIMని ఎలా యాక్టివేట్ చేయాలి?

  • ముందుగా ఫోన్ సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు యాడ్ మొబైల్ నెట్‌వర్క్ బటన్‌పై నొక్కండి.
  • దీని తర్వాత QR కోడ్‌ని స్కాన్ చేయండి.
  • ఇప్పుడు Airtel eSIM QR కోడ్‌ని స్కాన్ చేయండి
  • దీని తర్వాత మీ eSIM కోసం లేబుల్‌ని నమోదు చేయండి.
  • చివరగా నెట్వర్క్ యాడ్ అవుతుంది.

iOSలో Airtel eSIMని ఎలా యాక్టివేట్ చేయాలి?

  • సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి మొబైల్ సర్వీస్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు Add eSimపై నొక్కండి.
  • దీని తర్వాత Airtel eSIM QR కోడ్‌ని స్కాన్ చేయండి
  • ఇప్పుడు మీ eSIM కోసం లేబుల్‌ని జోడించండి.
  • చివరగా నెట్వర్క్ యాడ్ అవుతుంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×