E-Paper
Advertisement

Mental Health : ఏఐతో థెరపీ.. మెంటల్ హెల్త్‌పై ప్రభావం..

Mental Health : ఏఐతో థెరపీ.. మెంటల్ హెల్త్‌పై ప్రభావం..
Advertisement
Mental Health

Mental Health : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది కనిపెట్టినప్పటి నుండి ఇది అసలు మనుషులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఈ కృత్రిమ మేధస్సు చూపించిన ప్రతిభకు నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. అందుకే ఏఐతో మరిన్ని అద్భుతాలు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వారు ఓ ప్రయత్నాన్ని ప్రారంభించారు.

ఈరోజుల్లో చాలామంది.. ముఖ్యంగా యువత.. డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అందుకే అలాంటి వారికి థెరపిస్ట్ అవసరం ఉంటుంది. డిప్రెషన్‌లో ఉండేవారు ఎక్కువవ్వడంతో మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్స్ సంఖ్య తగ్గిపోయినట్టుగా అనిపిస్తోంది. మామూలుగా థెరపీ అనేది చాలా కాస్ట్‌లీ. అలా అయినా కూడా థెరపీ అనేది తీసుకోవాలని నిర్ణయించుకున్నా.. దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ఏఐను థెరపిస్ట్‌గా ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు.

Advertisement

ఇప్పటికే థెరపిస్ట్‌గా పనిచేసే ఏఐ మార్కెట్లో ఉంది. వీబోట్, వైసా, యోపర్.. ఇవే దానికి ఉదాహరణలు. ఇవి ఎప్పటికప్పుడు తమ పేషెంట్లను కనిపెడుతూ.. వారికి కావాల్సిన మానసిక సాయాన్ని అందిస్తూ ఉంటాయి. చాట్‌బోట్‌తో థెరపీ తీసుకుంటున్న వారందరూ.. ఇవి వారికి తోడుగా ఉంటూ.. ఎంతో ఉపయోగపడుతుందని రివ్యూ ఇస్తున్నారు. మామూలుగా మనుషులకు సమస్యలు చెప్పుకున్నప్పుడు వారు జడ్జ్ చేస్తారన్ని భయం ఉంటుంది. కానీ చాట్‌బోట్స్‌తో అలాంటి భయాలేవీ లేవు అని వారు చెప్తున్నారు.

చాట్‌బోట్స్ అనేవి మనుషులకు ఎంగేజ్ అవ్వడానికి ప్రయత్నించినా.. కొందరు మాత్రం సులువుగా తమ బాధలను వాటితో పంచుకోవడానికి సిద్ధంగా ఉండరు. అలాంటి సందర్భాల్లోనే సమస్యలు ఎదురవుతాయి. హ్యామన్ థెరపిస్ట్.. తమ పేషెంట్లకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి.. వారి మెంటల్ హెల్త్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ చాట్‌బోట్ అలా చేయలేదు. అంతే కాకుండా చాట్‌బోట్ వల్ల జరిగే నష్టాలు ఏంటని కూడా శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో కనుక్కోలేకపోతున్నారు.

Advertisement

థెరపీ సమయంలో పేషెంట్లు చెప్పే వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనేది చాలా ముఖ్యం. అయితే హ్యామన్ థెరపిస్ట్స్.. తమ పేషెంట్లు చెప్పేదాన్ని బట్టి రెస్పాన్డ్ అవుతారు. కానీ చాట్‌బోట్ రెస్పాన్స్ ఏంటో ముందే తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి సమయంలో పేషెంట్లను పూర్తిగా వాటికి వదిలేయడం రిస్క్ అని నిపుణులు చెప్తున్నారు. థెరపీ సమయంలో పేషెంట్ల మెంటల్ హెల్త్ చాలా సున్నితంగా ఉంటుందని, అలాంటి సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని వారు తెలిపారు. దీంతో పాటు చాట్‌బోట్ థెరపీ వల్ల కలిగే మరికొన్ని నష్టాలను సరిచేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×