EPAPER
Kirrak Couples Episode 1

SpaceX direct-to-cell : శాటిలైట్ టూ ఫోన్.. స్పేస్-ఎక్స్ సంచలనం..

SpaceX direct-to-cell : శాటిలైట్ టూ ఫోన్.. స్పేస్-ఎక్స్ సంచలనం..

SpaceX direct-to-cell : స్పేస్-ఎక్స్‌గా సుపరిచితమైన స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ సంస్థ బుధవారం 21 స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో విశేషం ఏముందనే కదూ మీ అనుమానం? వీటిలో ఆరు శాటిలైట్లు మాత్రం ప్రత్యేకం. ‘డైరెక్ట్ టూ సెల్’(DTC) కమ్యూనికేషన్ల సామర్థ్యం ఉన్న ఉపగ్రహాలవి. వీటిని ప్రయోగించడం ఇదే తొలిసారి. స్టార్‌లింక్ టెర్మినల్ లేకుండానే యూజర్లు తమ మొబైల్ ఫోన్లను ఇక నేరుగా మొబైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావొచ్చు. భూమిపై మౌలికవసతులేవీ లేకుండానే స్టార్‌లింక్ శాటిలైట్లతో మొబైల్ ఫోన్లు లింక్ అవుతాయన్నమాట.


DTC ఫీచర్ ద్వారా యూజర్ల వాయిస్, టెక్ట్స్, డేటా సర్వీసులను ఎక్కడి నుంచైనా పొందే వీలుంటుంది. రిమోట్ ఏరియాలు, విపత్తుల వేళల్లోనూ నిరాటంకంగా కమ్యూనికేషన్‌ను కొనసాగించొచ్చు. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ సాయంతో వీటిని లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. DTC స్టార్‌లింక్ శాటిలైట్లు అనేవి అత్యంతాధునికమైన మోడెమ్‌లు. అంతరిక్షంలో ఇవి సెల్‌ఫోన్ టవర్ల మాదిరిగా పనిచేస్తాయి. దీని వల్ల మొబైల్ ఫోన్లకు సిగ్నల్ అందదనే సమస్యే ఉండదు.

వాస్తవానికి DTC శాటిలైట్లను గత నెలలోనే ప్రయోగించాల్సి ఉంది. సాంకేతిక సమస్యలతో ఇన్ని రోజులు వాయిదాపడింది. DTC ఫీచర్ అనేది కమ్యూనికేషన్లలో గేమ్ ఛేంజర్ అని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. సెల్యులర్ డెడ్ జోన్ల సమస్య దీని వల్ల తొలగిపోతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు ఈ ఫీచర్ సాయంతో ఇకపై నిరంతరాయంగా యాక్సెస్ అందించవచ్చని ఆ కంపెనీ పేర్కొంది.


అంతకుముందు స్టార్‌లింక్ మొబైల్ సర్వీస్ పైలెట్ ప్రాజెక్టుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) నుంచి స్పేస్-ఎక్స్ అనుమతి పొందింది. ఈ శాటిలైట్ల ద్వారా స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ యాక్సెస్ అందిస్తుంది. ఇందుకోసం అమెరికాలోని టీ-మొబైల్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు ఆ సంస్థతో స్పేస్-ఎక్స్ నిరుడు ఆగస్టులో ఒప్పందం చేసుకుంది. ఈ తరహాలోనే ఇతర దేశాల్లోని ప్రొవైడర్లతోనూ ఒప్పందాలు కుదిరాయి.

కెనడాలో రోజర్స్, జపాన్‌లో కేడీడీఐ, ఆస్ట్రేలియాలో ఆప్టస్, న్యూజిలాండ్‌లో వన్ ఎన్‌జెడ్, స్విట్జర్లాండ్‌లో సాల్ట్, చిలీ, పెరు దేశాల్లో ఎంటెల్ ప్రొవైడర్ సంస్థలు వీటిలో ఉన్నాయి. రానున్న ఆరు నెలల్లో మరో 840 DTC సామర్థ్యం కలిగిన శాటిలైట్లను ప్రయోగించాలని స్పేస్-ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం స్పేస్-ఎక్స్‌కు చెందిన 5000 శాటిలైట్లు రోదసిలో ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్నాయి.

https://twitter.com/i/broadcasts/1OwxWYmNbeeGQ?s=20

Tags

Related News

Flipkart Big Billion Days Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

iPhone 13 Price Cut: ఉఫ్ ఉఫ్.. చెమటలు పట్టించే ఐఫోన్ ఆఫర్, చాలా తక్కువకే కొనేయొచ్చు!

NASA Records Black hole Sound: అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లపై ఊహకందని డిస్కౌంట్లు!

Motorola razr 50: బ్లాక్ బస్టర్ డీల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్, డోంట్ మిస్‌ బ్రో!

Poco F6 5G Price Drop: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Big Stories

×