Big Stories

Signals From Earth:- భూమి నుండి గ్రహాంతరవాసులకు సిగ్నల్స్…

- Advertisement -

Signals From Earth:- అసలే గ్రహాంతరవాసులు ఉన్నాయా లేదా అన్నది ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. భూమికి దూరంగా ఉన్న గ్రహంలో జీవనం కొనసాగుతోంది అని తెలియడానికి ఇప్పటికీ ఆస్ట్రానాట్స్‌కు పలు రుజువులు దొరికాయి కానీ అవి కచ్చితంగా గ్రహాంతరవాసుల నుండి వచ్చినవే అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ పలువురు శాస్త్రవేత్తలు మాత్రం గ్రహాంతరవాసులు ఉన్నాయి, త్వరలోనే అవి మన ముందుకు రానున్నాయి అని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

రేడియో సిగ్నల్స్ ద్వారా గ్రహాంతరవాసులకు భూమి ఎక్కడ ఉందో తెలుస్తుందని, అప్పుడు భూమిని వెతుక్కుంటూ అవి వస్తాయని తాజాగా పలువురు శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో తేలింది. భూమికి ఆరు లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న బర్నాడ్ లాంటి స్టార్‌ నుండి గ్రహాంతరవాసులకు రేడియో సిగ్నల్స్ ఎలా అందుతాయి అనే విషయంపై వారు పరిశోధనలు చేశారు. అలాగే భూమిపైన ఉండే మొబైల్ టవర్ల సిగ్నల్స్ ద్వారా అవి భూమిని కూడా కనుగొంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈరోజుల్లో మొబైల్ టవర్స్ నుండి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా రాకుండా ఉండడానికి కంపెనీలు జాగ్రత్తపడుతున్నాయి. అయినా కూడా స్పెక్ట్రమ్స్ నుండి వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది బిలియన్స్‌లో ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీని కారణంగా సిగ్నల్స్ అనేవి భూమి గ్రహాన్ని దాటి ఇతర గ్రహాల వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్పెక్ట్రమ్ నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ చాలా బలంగా ఉంటున్నాయని, ఇలాగే కొనసాగితే.. అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఈ సిగ్నల్స్‌ను స్పేస్ నుండి కనుక్కోవడం సులువని తెలిపారు.

ఒకవేళ గ్రహాంతరవాసులకు భూమిపై నుండి సిగ్నల్స్ చేరగలిగితే అవి ఏ రూపంలో ఉంటాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించడం మొదలుపెట్టారు. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు ప్రపంచదేశాల నుండి ఆకాశానికి వెళ్తున్న స్పేస్ మిషిన్ల సంఖ్య ఎక్కువయిపోతోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్, కెప్లెర్, వంటి మిషిన్లు ఎన్నో కొత్త విషయాలను కనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా స్పేస్ నుండి భూమి నుండి వచ్చే సిగ్నల్స్‌ను కనుక్కోవడానికి ఒక కొత్త రకమైన శాటిలైట్‌ను తయారు చేసే ఆలోచనలో శాస్త్రవేత్తలు ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News