EPAPER

Snailfish : సముద్రలోతుల్లోకి ఈదిన చేప.. ఇదే మొదటిసారి..

Snailfish : సముద్రలోతుల్లోకి ఈదిన చేప.. ఇదే మొదటిసారి..
 Snailfish

Snailfish : సముద్రానికి, ఆకాశానికి ఎంత లోతు ఉందో ఎవరూ చెప్పలేదు. మనం శాటిలైట్ల ద్వారా, రాకెట్ల ద్వారా చూస్తున్న అంతరిక్షం చూడని అంతరిక్షం ఇంకా ఎంతో ఉందని నిపుణులు అంటుంటారు. అదే విధంగా మనం చూస్తున్న సముద్రం లోతు సగమే అని, పూర్తిగా సముద్రం లోతును తెలుసుకోవడం కూడా అసాధ్యమని వారు అంటారు. కానీ ఇప్పటివరకు ఏ చేప వెళ్లలేనంత లోతుకు ఒక చేప వెళ్లిందని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.


ఇప్పటివరకు ప్రపంచంలో ఏ చేప ఈదనంత లోతుకు ఒక చేప ఈదిందని జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంతే కాకుండా దానిని ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. ఇది స్నెయిల్‌ఫిష్ జాతికి చెందిందని, దీనిలో స్యూడోలిప్యారిస్ జీన్స్ ఉంటుందని మాత్రమే ఇప్పటివరకు వారు కనుక్కోగలిగారు. ఇది దాదాపు 8,336 మీటర్ల లోతులో అంటే 27,349 అడుగుల లోతులో ఈదిందని వారు చెప్తున్నారు. దీనిని ఒక ల్యాండర్ రికార్డ్ చేశాడని అన్నారు. ఏ చేప చేరుకోలేని, జీవించలేని లోతుకు ఈ స్నెయిల్‌ఫిష్ చేరుకుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ఈ స్నెయిల్‌ఫిష్ కంటే ముందు ఎక్కువ లోతుకు వెళ్లిన చేప పెసిఫిక్ మహాసముద్రంలో 8,178 మీటర్ల లోతుకు వెళ్లిందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి స్నెయిల్‌ఫిష్ 158 మీటర్లు ఎక్కువ లోతుకు ఈది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక డీప్ సీ సైంటిస్ట్ చేసిన స్టడీ ప్రకారం ఒక చేప 8,200 మీటర్ల నుండి 8,400 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లగలదు. దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో పరిశోధనలు ఈ విషయాన్ని నిజమని తేల్చాయి.


Related News

One Plus 13 : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Vivo X200 Pro Mini : వీవో కొత్త మెుబైల్ కిర్రాక్ బాస్.. హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ ఇంకా ఏమున్నాయంటే!

Amazon : ఐఫోన్స్, వాచెస్ పై భారీ డిస్కౌంట్ బ్రదర్… డోంట్ మిస్ ఇట్!

Google Chrome : గూగుల్‌ క్రోమ్‌లో ఈ సూపర్​ ఫీచర్‌ గురించి తెలుసా? – ఎంచక్కా అన్నీ చదివి వినిపించేస్తుంది!

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

×