EPAPER

Vivo Y300 Pro 5G Leaks: మిస్ చేయకండి.. వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోతాయ్!

Vivo Y300 Pro 5G Leaks: మిస్ చేయకండి.. వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోతాయ్!

Vivo Y300 Pro 5G Leaks: చైనీస్ టెక్ మేకర్ వివో భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లలో పాపులర్ బ్రాండ్. అందువల్ల కంపెనీ తన వినియోగదారులకు మిడ్ రేంజ్ ప్రైజ్‌లో అనేక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. అందువల్ల ఈ ఫోన్‌లను ప్రజలు చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ కంపెనీ తన మిడ్-రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విస్తరించడానికి కొత్త ఫోన్ Vivo Y300 Pro 5Gని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


Vivo ఇటీవలి కంపెనీ తన తాజా ఫోన్ Vivo Y200 Pro 5Gని విడుదల చేసింది. ఇది మార్కెట్లో అత్యధికంగా సేల్ అవుతున్న స్మార్ట్‌ఫోన్. అయితే ఇంతలోనే కంపెనీ రాబోయే ఫోన్ Vivo Y300 Pro 5G మోడల్, డిజైన్, స్పెసిఫికేషన్‌లు డేటాబేస్‌లో వెల్లడయ్యాయి. కాబట్టి ఈ ఫోన్ తాజా అప్‌డేట్‌లను చూద్దాం.

Also Read: కొత్త సరుకు.. సేల్స్‌లో దుమ్ములేపుతున్న ఫోన్లు.. చవకగా కోనేయండి!


Vivo Y300 Pro 5G  మోడల్ నంబర్ V2402గా ఉంది. అయితే vivo Y200 Pro 5G మోడల్ నంబర్ V2401. Vivo Y300 Pro 5G గురించి ఇంకా ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ఎటువంటి ఫీచర్లు ఉంటాయని వెల్లడికాలేదు. అయితే Vivo ముందు మోడళ్లను చూసి సోషల్ మీడియాలో చాలా మంది టిప్‌స్టర్లు రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి కొన్ని అంచనాలు వేశారు.

Vivo Y300 Pro 5G ముందు మోడల్ మాదిరిగానే మిడ్ రేంజ్ ప్రైజ్‌లో ఉంటుంది. చెప్పాలంటే Vivo Y200 Pro 5Gలో ఉన్న బెస్ట్ ఫీచర్లను Y300 Pro 5Gలో తీసుకొచ్చే అవకాశం ఉంది. Vivo Y200 Pro 5G మోడల్‌లో 6.78-అంగుళాల FHD+ రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: వాయమ్మో.. రూ.70వేల ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. మాములుగా లేదు!

vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్ల వషయానికి వస్తే Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్ ప్రాససర్ కలిగి ఉంటుంది. ఇది 2MP డెప్త్ కెమెరాతో పాటు 64MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది. అలానే 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. Y200 Pro 5G Android 14-ఆధారిత FunTouchOS 14 ఇంటర్‌ఫేస్‌తో ఉంటుంది. అయితే Vivo Y300 Pro 5G  అఫిషియల్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×