Simple Tips To Speed Up Computer : కంప్యూటర్ ప్రస్తుత రోజుల్లో ప్రతీ రంగంలోనూ భాగమైపోయింది. అది లేనిదే రోజు గడవని, పని పూర్తి కానీ పరిస్థితిగా మారిపోయింది. ఎందుకంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ అందించడం నుంచి అతి పెద్ద టాస్క్‌లను పూర్తి చేయడం వరకు అన్నీ పనులను ఇది చేస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ సమాచారం కోసం ఇంటర్నెట్ వినియోగించుకునేలా వీలుగా ఉంటుంది. అందుకే దీనిని ఆఫీస్లలతో పాటు ఇళ్ళల్లోనూ ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే మీ పీసీ లేదా ల్యాప్ టాప్‌లో దాని సామర్థ్యానికి మించి ఎక్కువ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేయడం, సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయకపోవడం, లేదా ఎక్కువ సేపు దానిని వినియోగించడం వల్ల స్లోగా రన్ అయ్యే సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే డోండ్ వర్రీ, ఈ టిప్స్ పాటిస్తే చాలు, మీ పీసీ లేదా ల్యాప్ టాప్ స్పీడ్ ఇట్టే పెరిగిపోతుంది. సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది! ఇంతకీ ఆ టిప్స్ అవేంటంటే?
కంప్యూటర్ స్పీడ్ రన్ అవ్వాలంటే, ముందుగా ఎప్పటికప్పుడు విండోస్‌తో పాటు డివైజ్ డ్రైవర్స్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మీ పీసీని రీస్టార్ట్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు, మీకు కావాల్సినవి, ఉపయోగించాలని అనుకుంటున్న అప్లికేషన్లను మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మీ కంప్యూటర్ వేగంగా పని చేయడం ప్రారంభిస్తుంది. అనవసరమైన అప్లికేషన్స్, బ్రౌజర్లో ట్యాబ్స్ అన్నీ ఓపెన్ చేసినా కూడా పీసీ స్లోగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది.
పీసీ ఆన్ అవ్వగానే కొన్ని స్టార్టప్ ప్రోగ్రామ్ ఓపెన్ అయి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్‌లను డిజేబుల్ చేయడం వల్ల కూడా పీసీ స్పీడ్ రన్ అవుతుంది. డిస్క్ స్పేస్ పూర్తిగా ఫుల్‌గా అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ ఫుల్ అయితే డిస్క్‌లోని అనవసరమైన ఫైల్స్‌ను రిమూవ్ అంటే డిలీట్ చేసుకోవాలి. లేదంటే మరో మెమొరీ డివైజ్‌లోకి వాటిని ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల కూడా డిస్క్ స్పేస్ ఖాళీ అవుతుంది. కంప్యూటర్ స్పీడ్‌గా రన్ అవుతుంది.
ALSO READ : అసలు ఇండోనేషియాలో ఐఫోన్ ను ఎందుకు బ్యాన్ చేశారు?
కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో ఉండే పేజింగ్ ఫైల్ అనే ఏరియాను విండోస్ ఒక మెమొరీలాగా వినియోగిస్తుంది. విండోస్ 11లో పేజ్ ఫైల్ పరిమాణాన్ని ఆటోమేటిక్‌గా మేనేజ్ చేసే సెట్టింగ్ ఉంటుంది. దీనిని ఆన్ చేయాలి. దీంతో కంప్యూటర్ స్పీడ్‌గా పని చేస్తుంది.
ReadyBoostను కూడా వినియోగించడం వల్ల మీ కంప్యూటర్ స్పీడ్‌గా రన్ అవుతుంది. ఈ రెడీ బూస్టర్ మీ పీసీకి యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్ లాంటి రిమూవబుల్ డ్రైవ్‌లను ఎటాచ్ చేసి, ర్యామ్‌ను పెంచుకునే వెసులు బాటును కల్పిస్తుంది. అయితే ఈ రెడీ బూస్ట్‌ను వినియోగించుకోవాలంటే హై డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ 500 ఎంబీ లేదా అంత కన్నా ఎక్కువ ఫ్రీ స్పేస్ కలిగిన మెమొరీ కార్డ్ లేదా యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్‌ను ఉపయోగించాలి.
విండోస్ 11 కంప్యూటర్‌లో యానిమేషన్స్కో పాటు షాడో ఎఫెక్ట్స్ లాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి సిస్టమ్ రిసోర్స్‌ను ఎక్కువగా వాడుకోవడం వల్ల పీసీ పని సామర్థం తగ్గుతుంది. ర్యామ్ తక్కువగా ఉన్న పీసీల్లో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. కాబట్టి అనవసరపు విజువల్ ఎఫెక్ట్స్‌ను టర్న్ ఆఫ్ చేసుకోవాలి.
కంప్యూటర్‌లో సేవ్ చేసే ఫైల్స్ డిఫాల్ట్‌గా కంప్యూటర్‌తో పాటు వన్‌డ్రైవ్‌లోనూ సేవ్ అవుతాయి. దీనివల్ల కంప్యూటర్ పాడైనా, ఈ వన్‌డ్రైవ్ ద్వారా ఫైల్స్‌ను తిరిగి పొందొచ్చు. కాబట్టి ఈ వన్ డ్రైవ్ సింకింగ్ వల్ల కూడా కంప్యూటర్ స్లో అవ్వొచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వన్‌డ్రైవ్ సింకింగ్‌ను పాజ్ చేయాలి.
కంప్యూటర్‌లో డేంజరస్ వైరస్‌లు, మాల్‌వేర్‌లు ఇన్‌స్టాల్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. మలీసియెస్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు, కూడా పీసీ స్లో అవుతుంది. కాబట్టి వీటిని తొలగించడానికి యాంటీవైరస్, యాంటీ మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించాలి. లేదంటే విండోస్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వైరస్‌లను, మాల్‌వేర్‌ను రిమూవ్ చేయాలి.