EPAPER

Android : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

Android : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

Android : రోజు రోజుకి ఫైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT) ఆండ్రాయిడ్ వాడే యూజర్స్ కు షాక్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ వాడే వినియోగదారులకు అధిక స్థాయిలో ప్రమాదం పొంచి ఉందని… హ్యాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.


పెరుగుతున్న టెక్నాలజీ తో పాటు సమస్యలు సైతం అంతే తేలికగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నెట్వర్క్ ను ఉపయోగించుకొని పలు దాడులకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ లక్ష్యంగా దాడులకు దిగే అవకాశం ఉందని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని… అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT)  సైతం ఆండ్రాయిడ్ వాడే యూజర్లకు అధిక స్థాయిలో ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ లో అత్యధికంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్. కోట్లాది మంది యూజర్లు గూగుల్ యాజమాన్యంతో నడిచే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం మీద ఆధారపడుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, వివో వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ లో సైతం ఆండ్రాయిడ్ ఓ ఎస్ ఆపరేటింగ్ సిస్టం ఉంది.


ALSO READ : రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం సైతం భారీగా పెరగటంతో బ్యాంకింగ్, లొకేషన్ యాక్సిస్ వంటి కీలక సమాచారం కోసం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే పలువురు యూజర్స్ ఆధారపడుతున్నారు. ఇక ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి గూగుల్ సైతం ఎప్పటికప్పుడు ఓఎస్ ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. అయితే యూజర్స్ ఓఎస్ ను అప్డేట్ చేయకుండా వినియోగిస్తూ ఉంటే ప్రమాదం పొంచి ఉంటుందని.. స్మార్ట్ ఫోన్స్ లో ఉండే ముఖ్యమైన సమాచారం సైబర్ నేరగాల చేతికి వెళ్లే అవకాశం ఉందని తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది

ఇక ఆండ్రాయిడ్ లో యూజర్స్ హ్యాక్ చేయగలిగే పలు విషయాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆండ్రాయిడ్  గుర్తించింది. ఆండ్రాయిడ్ ఓ ఎస్ లో పలు లోపాలు ఉన్నాయని తెలిపింది. ఆండ్రాయిడ్ 15, 14,  13, 12తో పాటు 12L లో కొన్ని వెర్షన్స్ లో హ్యాకర్స్ ఉపయోగించే పలు అప్డేట్స్ ను గుర్తించింది. ఇవి వినియోగదారులను తేలికగా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఉపయోగించే వినియోగదారులు గూగుల్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని.. క్రోమ్ వినియోగించే వినియోగదారులు బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్ ఉపయోగించాలని సూచించింది.

సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, ఆర్మ్ కాంపోనెంట్, ఫ్రేమ్ వర్క్, కెర్నల్ ఇమేజినేషన్, టెక్నాలజీస్ కాంపోనెంట్స్ యూనిసో కాంపోనెంట్స్, క్వాలిటీ సోర్స్ కాంపోనెంట్స్ లో లోపాలు ఉన్నాయని గతంలోనే హెచ్చరించిన ఈ సంస్ధ… మరోసారి యూజర్స్ కు హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాదాలు పొంచి ఉన్నాయని అప్రమత్తంగా ఉండకపోతే సున్నితమైన డేటా హ్యాకర్స్ చేతికి చిక్కే అవకాశం ఉందని తెలిపింది.

Related News

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

Redmi : రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

Realme : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

Whatsapp : వాట్సాప్ షాకింగ్ డెషిషన్.. లక్షల్లో అకౌంట్స్ బ్యాన్

Jio Bharat V3 And V4 : అతి తక్కువ ధరకే జియో భారత్ మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Big Stories

×