EPAPER

Scientists:- ఏఐను డెవలప్ చేయడం కోసం ప్రకృతి సాయం..

Scientists:- ఏఐను డెవలప్ చేయడం కోసం ప్రకృతి సాయం..

Scientists:- ఎప్పుడైనా ప్రకృ‌తి, టెక్నాలజీ కలిసి పనిచేస్తేనే అద్భుతాలు జరుగుతాయని ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. కానీ చాలావరకు పర్యావరణవేత్తలు మాత్రం టెక్నాలజీనే ప్రకృతిని నాశనం చేస్తుందని చెప్తారు. రెండూ కొంతవరకు వాస్తవాలే. ప్రకృతి, టెక్నాలజీ కలిస్తేనే బాగుంటుంది అనుకునే శాస్త్రవేత్తలు ఆ కోణంలో పరిశోధనలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఏఐను డెవలప్ చేయడం కోసం ఎకోసిస్టమ్ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.


సమాచారం విషయంలో ఏఐ టూల్స్‌కు సంబంధించిన న్యూరల్ నెట్‌వర్క్స్‌ను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ ఉండాలి. అయితే ఇలాంటి న్యూరల్ నెట్‌వర్క్స్‌ను డెవలప్ చేయడం కోసం ఎకోసిస్టమ్స్ కరెక్ట్ అని శాస్త్రవేత్తలు భావించారు. అందుకే ఎకోసిస్టమ్ నుండి కంప్యూటేషనల్ పవర్‌ను ఏఐ కోసం బయటికి తీయబోతున్నారు. ఎకోసిస్టమ్‌లో ఉండే ప్రే ప్రిడేటర్ ఇంటరాక్షన్స్ అనేవి సమాచారాన్ని సేకరించడానికి, దాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందని, దానినే ఏఐ కోసం వినియోగించాలి అనుకుంటున్నారు.

ఎకాలజికల్ రిజర్వాయర్ కంప్యూటింగ్ అనే పేరుతో శాస్త్రవేత్తలు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఎకాలజికల్ నెట్‌వర్క్స్‌కు కంప్యూటేషనల్ పవర్ ఉంటుంది అని నమ్ముతున్న శాస్త్రవేత్తలు ఇందులో రెండు కంప్యూటింగ్ మోడల్స్‌ను తయారు చేశారు. అందులో ఒకటి సిలికో ఎకాలజికల్ రిజర్వాయర్ కంప్యూటింగ్, మరొకటి ఎకాలజికల్ రిజర్వాయర్ కంప్యూటింగ్. ఈ రెండు మోడల్స్ వేర్వేరు లక్ష్యాలతో పనిచేస్తాయి. ఇప్పటికే వీటిపై ప్రయోగాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.


ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ పరిశోధన బయోడైవర్సిటీ, హై కంప్యూటేషనల్ పవర్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మెరుగుపరచనున్నాయి. కమ్యూనిటీ డైవర్సిటీ, కంప్యూటేషనల్ కేపబులిటీ వల్లే బయోడైవర్సిటీ శాతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎకాలజికల్ సిస్టమ్ అనేవి కంప్యూటింగ్ కోసం పనిచేసినప్పుడు కూడా వాటి నుండే వచ్చే రిజల్ట్స్ చాలా మెరుగ్గా ఉంటాయని వారు భావిస్తున్నారు. ఈ కోణంలో మరెన్నో పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధపడుతున్నారు

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×