EPAPER

Samsung Galaxy Z Flip 5 : సామ్‌సంగ్ ఫ్లిప్‌ ఫోన్‌పై ఊహకందని ఆఫర్లు.. ఏకంగా రూ.64,550 డిస్కౌంట్!

Samsung Galaxy Z Flip 5 : సామ్‌సంగ్ ఫ్లిప్‌ ఫోన్‌పై ఊహకందని ఆఫర్లు.. ఏకంగా రూ.64,550 డిస్కౌంట్!

Rs 64,550 Discount on Samsung Galaxy Z Flip 5 Mobile: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లకు మంచి గిరాకి ఉంది. అయితే వీటి ధరలు మాత్రం భారీ స్థాయిలో ఉంటాయి. మరి మీరు కూడా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్‌లో ఉంటే.. దాని ధరలు తగ్గే వరకు వేచి ఉంటే ఇదే సరైన అవకాశం. ప్రముఖ కొరియన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Samsung.. దాని కొత్త Galaxy Z Fold 6, Galaxy Z Flip 6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను Galaxy Ringతో పాటు జూలై 10న Samsung Galaxy Unpacked ఈవెంట్‌లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈ లాంచ్‌కు ముందు Samsung Galaxy Z Flip 5 స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ను అమెజాన్‌ అందిస్తోంది.


Samsung Galaxy Z Flip 5 Price And Offers

Samsung Galaxy Z Flip 5 8GB RAM 256GB స్టోరేజ్ ధర అమెజాన్‌లో రూ.1,02,999గా ఉండగా.. 6 శాతం తగ్గింపు ఉంది. ఈ తగ్గింపుతో దీన్ని రూ.96,999లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్‌లతో స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 ఫ్లాట్ ఇన్‌స్టంట్ తగ్గింపును అందిస్తోంది.


ఈ తగ్గింపుతో సామ్‌సంగ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.82,999లకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.50,550 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. దీని బట్టి చూస్తే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మొత్తం రూ.64,550 డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు దీనిని కేవలం రూ.32,449కే కొనుక్కోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఇది లేత గోధుమరంగు, ఆకుపచ్చ, నలుపు రంగులలో అందుబాటులో ఉంది.

Also Read:  గెలాక్సీ ఎఫ్ 55 లాంచ్ వాయిదా.. కొత్త డేట్, ధర, స్పెసిఫికేషన్

Samsung Galaxy Z Flip 5 Specifications

Samsung Galaxy Z Flip 5 కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఓఎస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. 6.7-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ప్రైమరీ డిస్‌ప్లే, 3.4-అంగుళాల సూపర్ AMOLED ఫోల్డర్-ఆకారపు కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

Galaxy Z Flip 5లో వెనుకవైపు రెండు డ్యూయల్ 12-మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఫోన్ ముందువైపు సెల్ఫీల కోసం 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతుతో 3,700mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. దీనికి అదనంగా వాటర్ రెసిస్టెన్సీ కోసం IPX8 రేటింగ్‌ను కలిగి ఉంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×