Samsung Galaxy S23 5G, Google Pixel 8 : ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్ లో అత్యంత డిమాండ్ ఉన్న మెుబైల్స్ Samsung Galaxy S23 5G, Google Pixel 8. వీటి డిజైన్ తో పాటు ఫీచర్స్ సైతం అందిరిపోయేలా ఉన్నయి. తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే వినియోగదారులు ఈ ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.
Samsung Galaxy S23, Google Pixel 8 రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలేకపోతున్నారా.. Samsung Galaxy S23 5G బెస్ట్ కెమెరా ఫీచర్స్ ను అందిస్తుంది. ఇక Google Pixel 8 ఉపయోగకరమైన AI ఫీచర్‌లతో పాటు స్టాక్ ఆండ్రాయిడ్ ఫీచర్‌లను అందిస్తుంది. ఇక బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ లో అందుబాటులోకి వచ్చేసిన ఈ మెుబైల్స్ లో ఏది బెస్టో సెలెక్ట్ చేసుకోవాలంటే… వాటి ఫీచర్స్, ధర, డిజైన్, డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేయాల్సిందే.
ధర – Samsung Galaxy S23 5G 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 39,999గా ఉంది. ఇక 8GB RAM + 256GB ధర రూ. 42,999దా ఉంది. ఇక Google Pixel 8 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజీ ధర రూ.39,999. అదే 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 42,999 గా ఉంది.
డిజైన్ – Galaxy S23 5G అల్యూమినియం ఫ్రేమ్ బ్యాక్ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ తో లాంఛ్ అయింది. దీనికి IP68 రేటింగ్‌ను కూడా ఉంది. ఫాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్, లావెండర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 146.3 x 70.9 x 7.6mmతో 168 గ్రాములు బరువు కలిగి ఉంది. Google Pixel 8 బ్యాక్ ప్యానెల్ పాలిష్ గ్లాస్, శాటిన్ మెటల్ తో లాంఛ్ అయింది. అబ్సిడియన్, హాజెల్, రోజ్ కలర్స్ లో 150.5 x 70.8 x 8.9mm బరువు 187 గ్రాములుగా ఉంది.
డిస్ ప్లే – Samsung Galaxy S23 5G 1080×2340 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల పూర్తి HD+ ఇన్ఫినిటీ-O డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో ఉది. Google Pixel 8 6.2-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను ప్యాక్ చేస్తుంది. ఫోన్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో అందుబాటులో ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్ – Samsung Galaxy S23 5G Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో పనిచేయగా… Google Pixel 8 టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌తో Google Tensor G3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది.
సాఫ్ట్‌వేర్ – ఈ రెండు మోడల్‌లు ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతాయి. ఇది మూడేళ్ల OS అప్‌గ్రేడ్స్ ను 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను అందిస్తుంది.
కెమెరా – Samsung Galaxy S23 5Gలో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. 50-మెగాపిక్సెల్ డ్యూయల్-పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12-మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. Google Pixel 8 12 మెగాపిక్సెల్ Sony IMX386 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
ALSO READ : ట్రైన్ టికెట్ బుకింగ్, UPI పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ బిల్స్, గ్యాస్ సిలిండర్ ధరల్లో కొత్త రూల్స్