EPAPER

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ను ఈ ఏడాది జులై లో శాంసంగ్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్​లో దీనిని విడుదల చేసింది. అయితే అప్పుడు కొన్ని దేశాల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ రింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన శాంసంగ్​, ఇప్పుడు భారత్‌లోకి కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. దీని కోసం ముందస్తు బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది శాంసంగ్​. కాగా, ఈ రింగ్​ హెల్త్, ఫిట్​నెస్ ట్రాకర్​లను కలిగి ఉంటుంది.


బుకింగ్​ ఎక్కడ చేయాలంటే? – శాంసంగ్‌ గెలాక్సీ రింగ్​ను శాంసంగ్​ సంస్థ అధికారిక వెబ్‌సైట్​లో చేసుకోవచ్చు. ఇంకా ఇతర ప్రముఖ ఇ-కామెర్స్​ ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​ అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ సహా ఇతర రిటైల్‌ స్టోర్‌లలోనూ ప్రీ ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం రూ .1999 చెల్లించాలి. రిజర్వేషన్‌ చేసుకునేటప్పుడు చెల్లించిన నగదు మొత్తాన్ని తిరిగిస్తామని శాంసంగ్​ సంస్థ తెలిపింది. అలానే ఈ రింగ్​ను ప్రీ ఆర్డర్​ చేసుకుని కొనుగోలు చేసిన వారికి రూ.4999 విలువైన వైర్‌లెస్‌ ఛార్జర్‌ డుయోను కూడా అందించనున్నారు. ఈ విషయాన్ని శాంసంగ్ సంస్థ తెలిపింది.

ALSO READ : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!


భారత్​లో ఎప్పుడంటే ? – ఈ శాంసంగ్ గెలాక్సీ రింగ్​ను భారత మార్కెట్​లోకి ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తుందనే సమాచారాన్ని శాంసంగ్​ సంస్థ తెలుపలేదు. అలానే ఈ స్మార్ట్‌ రింగ్‌ ధరను శాంసంగ్​ సంస్థ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ రింగ్‌ పలు రంగుల్లో లభిస్తుంది. టైటానియం గోల్డ్‌, టైటానియం సిల్వర్‌, టైటానియం బ్లాక్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. 5- 13 వేర్వేరు సైజుల్లో దొరకనుంది. అంటే మొత్తం 9 సైజుల్లో కొనుగోలు చేయవచ్చు.

బ్యాటరీ కెపాసిటీ – 5 నెం. సైజు కలిగిన రింగ్‌ 18mAh బ్యాటరీతో ఉండగా, గరిష్ఠంగా 13 సైజు కలిగిన రింగ్ 23.5mAh బ్యాటరీ కెపాసిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ రింగ్‌ ఛార్జింగ్‌ కేస్‌ 361mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది. ఈ ఛార్జింగ్ కేస్‌లో ప్రత్యేక LED లైట్‌ను అమర్చారు. సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.

రింగ్​లో ఉన్న ఫీచర్స్​ ఇవే – శాంసంగ్‌ గెలాక్సీ రింగ్​లో PPG సెన్సార్‌ను అమర్చారు. ఇది హార్ట్‌ బీట్‌లో మార్పులను గుర్తిస్తుంది. టెంపరేచర్‌ సెన్సార్‌, యాక్సిలిరోమీటర్‌ వంటి సెన్సార్‌లు కూడా ఈ రింగ్​లో ఉన్నాయి. ది. ఎనర్జీ స్కోర్‌, వెల్‌నెస్‌ టిప్స్‌ వంటి ఫీచర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో పాటు AI స్లీప్‌ అల్గారిథం ను ఈ రింగ్​ కలిగి ఉంది. దంతో నిద్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

రుతుక్రమంను కూడా ట్రాక్​ – ఈ గెలాక్సీ రింగ్‌ మహిళల్లో ఉన్న చర్మ ఉష్ణోగ్రత ఆధారంగా రుతుక్రమాన్ని కూడా ట్రాక్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌ రింగ్‌ 8 MB స్టోరేజీని సపోర్ట్ చేస్తుంది. ఈ రింగ్​కు హెల్త్ యాప్‌ లింక్ చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా రింగ్‌ లొకేషన్‌ను కూడా గుర్తించవచ్చు. ఇది IP68 రేటింగ్‌, బ్లూటూత్‌ 5.4 తో పని చేస్తుంది.

 

Related News

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Commercial Space Station: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Phone Pay Diwali Insurence : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

Instagram Followers : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

Big Stories

×