BigTV English

Rising temperatures:- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నాసా షాక్..

Rising temperatures:- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నాసా షాక్..

Rising temperatures :- నాసా పరిశోధనల ప్రకారం ఈ ఏడాది ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగనున్నాయని అంచనా. గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రతీ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే 2022లో యావరేజ్ ఉష్ణోగ్రతల కంటే 0.89 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 1951-1980 మధ్య ఉష్ణోగ్రతలను కొలమానంగా తీసుకొని వీటిని వెల్లడించారు.
ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయని నాసా అడ్మిన్ బిల్ నెల్సన్ తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న వేడి దీనికి సూచన అని అన్నారు. కార్చిచ్చులు పెరుగడం, వరదలు బీభత్సం సృష్టించడం, కరువు పెరిగిపోవడం వీటిని సంకేతాలను ఆయన అన్నారు. వాతావరణ మార్పులను క్షుణ్ణంగా పరిశీలించడం తమ బాధ్యత అని బిల్ తెలియజేశారు.
1880 నుండి పోలిస్తే గత తొమ్మిదేళ్లలోనే భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. 19వ శతాబ్దం నుండి ఉన్న ఉష్ణోగ్రతలను యావరేజ్‌గా తీసుకుంటే 2022లో భూమి 1.11 డిగ్రీలు ఎక్కువ వేడిగా మారింది. గ్రీన్ హౌస్ గ్యాస్‌లను గాలిలోకి వదలడమే ఈ వాతావరణ మార్పులకు ముఖ్యం కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2020లో కోవిడ్ కారణంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్‌లు గాలిలో కలిసిన సంఖ్య తగ్గిందన్నారు.
ఇటీవల ఇతర అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి నాసా చేసిన పరిశోధనల్లో 2022లోనే కార్బన్‌డయాక్సైడ్ గాలిలో ఎక్కువగా కలిసిందని తేలింది. దీంతో పాటు మిథేన్ కూడా ఈ లిస్ట్‌లో చేరిందన్నారు.
గతేడాది పాకిస్థాన్‌లో వచ్చిన వరదలు, అమెరికాలో వచ్చిన కరువే ఈ వాతావరణ మార్పులకు సంకేతమని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంతే కాకుండా గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలో వచ్చిన వరదలు కూడా ఇప్పటివరకు వచ్చినవాటిలో ప్రమాదకరమైనవని అన్నారు.
ప్రతీ సంవత్సరం వాతావరణంలో పలు మార్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విధంగా చూస్తే 2022లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. 1880 నుండి చూసుకుంటే 2022లో ఉష్ణోగ్రతలు ఆరవ స్థానంలో ఉన్నాయని అన్నారు.


Follow this link for more updates:- Bigtv


Related News

Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో సిరీస్ ఇండియాలో లాంచ్.. 7,000mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో సూపర్ ఫీచర్లు

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

Big Stories

×