EPAPER

Richter Scale Reading:రిక్టర్ స్కేల్‌ రీడింగ్ గురించి తెలియని విషయాలు..

Richter Scale Reading:రిక్టర్ స్కేల్‌ రీడింగ్ గురించి తెలియని విషయాలు..

Richter Scale Reading:భూకంపాలు అనేవి ఒక్క క్షణంలో ఎన్నో ప్రాణాలను తీసేస్తాయి. అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భూకంపాన్ని గుర్తించడం కూడా వారికి అసాధ్యమే అని తెలిసింది. అయితే తాజాగా భూకంపాల గురించి రిక్టర్ స్కేక్‌లో వచ్చే రీడింగ్ కూడా సరైనది కాదని శాస్త్రవేత్తలు గమనించారు.
రిక్టర్ స్కేల్‌లో ఒక్క నెంబర్ పెరిగితే.. భూకంప తీవ్రత పదిరెట్లు పెరుగుతుందని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది.


ఉదాహరణకు రిక్టర్ స్కేల్‌పై 6 పాయింట్ల మ్యాగ్నిట్యూడ్‌గా చూపించే భూకంపం అసలైతే దానికంటే పదిరెట్లు ఎక్కువ మ్యాగ్నిట్యూడ్‌తో వచ్చుంటుంది అని అర్థం. రిక్టర్ స్కేల్ అనేది ముందుగా క్యాలిఫోర్నియాలో కనుగొన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవించడంతో ఈ పరికరాన్ని తయారు చేశారు.

రిక్టర్ స్కేల్ అనేది కేవలం తక్కువ తీవ్రతో వచ్చే భూకంపాలను మాత్రమే సరిగ్గా కనిపెట్టగలదని, ఎక్కువ తీవ్రతను అది కరెక్ట్‌గా గుర్తించలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే అలాంటి తీవ్రమైన భూకంపాలను స్టడీ చేయడానికి మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ దీని గురించి ఎక్కువమందికి తెలియదు. మామూలుగా భూకంపాల తీవ్రతను కనుక్కోవడానికి రిక్టర్ స్కేల్‌నే ఎక్కువగా వినియోగిస్తుంటారు.


చైల్‌లో 1960 మే 22న రిక్టర్ స్కేల్‌పై అత్యంత తీవ్రమైన భూకంపం రికార్డ్ అయ్యింది. దాని తీవ్రత 9.5 మ్యాగ్నిట్యూడ్‌గా రికార్డ్ అయ్యింది. ఎంతో ప్రాణనష్టం కూడా జరిగింది. ఇప్పటికీ ఇదే తీవ్రమైన భూకంపంగా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. దీనిని వాల్దీవియా ఎర్త్‌క్వేక్‌గా పిలుస్తారు. ఆపై ఎన్నో భూకంపాలు కూడా రిక్టర్ స్కేల్‌లో నమోదయ్యాయి. తాజాగా టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప తీవ్రత 7.8 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదయ్యింది. 1939 తర్వాత ఇంత తీవ్రమైన భూకంపం సంభవించడం ఇదే మొదటిసారి. దాదాపు 33 వేలమంది ఈ భూకంపంలో ప్రాణాలు కోల్పోయారు.

Tags

Related News

Sara Ali Khan: వినాయక చవితి వేడుకల్లో సారా అలీ ఖాన్.. డార్క్ బ్లూ లెహెంగాలో చూడచక్కని అందం

Ram Nagar Bunny: ‘రామ్ నగర్ బన్నీ’ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ అదుర్స్

Thalapathy Vijay: దళపతి విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Big Stories

×