Big Stories

Heart Attack : హార్ట్ ఎటాక్‌పై పరిశోధనలు.. సీపీఆర్ విషయంలో సలహా..

- Advertisement -

Heart Attack : ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ముఖ్యంగా ఈమధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మామూలుగా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలామంది సీపీఆర్‌ను ఉపయోగిస్తారు. అసలు సీపీఆర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేదానిపై శాస్త్రవేత్తలు తాజాగా ఒక కొత్త విషయం బయటపెట్టారు. ఇది అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు.

- Advertisement -

నార్వేలోని ఆసుపత్రులలో ప్రతీ ఏడాది దాదాపు 1200 నుండి 1500 మంది హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. ర్యాపిడ్, సౌండ్ ట్రీట్మెంట్ అనేవి హార్ట్ ఎటాక్ పేషెంట్లకు తిరిగి ప్రాణం పోయడానికి కొంతవరకు సహాయపడుతున్నాయి. ఒకవేళ ఆసుపత్రిలో అందరు వైద్యులు ఉండగానే పేషెంటుకు హార్ట్ ఎటాక్ వచ్చినా కూడా ఈ ర్యాపిడ్ ట్రీట్మెంట్ అనేది వారిని బ్రతికించే అవకాశాలు చాలా తక్కువే. నలుగురు పేషెంట్లలో కేవలం ఒకరు మాత్రమే ఈ ట్రీట్మెంట్ ద్వారా బ్రతుకుతారు.

తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం పేషెంట్ ఈసీజీ అనేది వారి చికిత్సను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని తేలింది. ఆసుపత్రిలో ఒక పేషెంటుకు హార్ట్ ఎటాక్ వచ్చి.. అతడి గుండె ఆగిపోయినప్పుడు.. డాక్టర్లు వెంటనే స్పందించాలి. ఆ చివరి నిమిషంలో వారిని బ్రతికించడానికి ప్రయత్నించాలి. కానీ ప్రతీ కేసులో వారు చేసే ప్రయత్నం పేషెంటును బ్రతికిస్తుందని పూర్తిగా నమ్మకం లేదు. హార్ట్ ఎటాక్ వల్ల బాధపడుతున్న వారు చాలావరకు ఒకే ట్రీట్మెంట్‌ను అందుకుంటున్నారు. అది లాజికల్‌గా కరెక్ట్‌ కాదని వైద్యులు భావిస్తున్నారు.

హార్ట్ ఎటాక్‌పై పరిశోధనల కోసం డాక్టర్లు.. 298 పేషెంట్ల ఈసీజీ రిపోర్టును స్టడీ చేశారు. ఈ పేషెంట్లకు ఈసీజీ అనేది ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. అందుకే పేషెంట్ల ఆరోగ్యం గురించి తగిన సమాచారం తెలుసుకోవడానికి ఈసీజీ రిపోర్ట్ అనేది బెస్ట్ ఆప్షన్ అని వైద్యులు అంటున్నారు. ఈ ఈసీజీ రిపోర్టులలో పేషెంట్ గుండె ఆగిపోయే ముందు పల్స్ రేటు ఎలా ఉంది, మళ్లీ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత హార్ట్ రేటు ఎలా మారింది అనే విషయాలను క్షుణ్ణంగా పరీక్షించారు.

పల్స్ రేటు మళ్లీ మామూలుగా అయిన తర్వాత హార్ట్ రేటు అనేది చాలా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గమనించారు. ఈసీజీ సిగ్నల్ అనేది గుండెను గమనించడానికి ఉపయోగపడుతుందని వారు బయటపెట్టారు. ఈ క్రమంలో వారు రెండు ముఖ్యమైన విషయాలను సూచించారు. గుండెపోటుకు గురయిన వారికి వెంటనే సీపీఆర్ చేయాలని, 30 సార్లు సీపీఆర్ చేసిన తర్వాత రెండుసార్లు ఊపిరిని ఇవ్వాలని అన్నారు. ఇతర సహాయం అందేవరకు సీపీఆర్ అనేది ఇలాగే చేస్తూ ఉండాలని వైద్యులు సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News