EPAPER

Replacing chemical fertilizers :- కెమికల్ ఎరువుల స్థానంలో కొత్త మందులు..

Replacing chemical fertilizers :- కెమికల్ ఎరువుల స్థానంలో కొత్త మందులు..

Replacing chemical fertilizers:- సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నో ఇతర రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడే ఇండియా లాంటి దేశంలో కూడా రైతులకు అండగా నిలబడడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రైతులకు ఉపయోగపడే ఎన్నో కొత్త రకమైన పరికరాలను తయారు చేశారు శాస్త్రవేత్తలు. తాజాగా ఎరువులకు బదులుగా ఏమి ఉపయోగిస్తే పంట బాగా పండుతుంది అనేదానిపై ఓ వివరణ ఇచ్చారు.


కెమికల్ ఎరువులకు బదులుగా ఏమి ఉపయోగిస్తే భూమికి నష్టం జరగకుండా పంట బాగా పండుతుంది అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా యూరప్ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఓ కొత్త అంశం బయటపడింది. మనుషుల మలమూత్రాల నుండి కూడా ఎరువులు తయారు చేయవచ్చని వారు కనుగొన్నారు. పైగా అలా తయారు చేసిన ఎరువులు ఉపయోగించడానికి సులభంగా ఉండడంతో పాటు ఆ పంట నుండి వచ్చిన ఆహారం మనుషులకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్‌లో తెలిపారు.

ఇటీవల శాస్త్రవేత్తలు కెమికల్ ఎరువులను, మనుషుల మలమూత్రాల ఎరువుల సామర్థ్యంతో పోల్చి చూశారు. అయితే మలమూత్ర ఎరువులు కంటే కెమికల్ ఎరువులు 6.5 శాతం తక్కువ సామర్థ్యం కలవని తెలిపారు. ఈ కొత్త తరహా ఎరువులతో పండిన క్యాబేజిలు మనుషులలో నొప్పిని తగ్గించే ఔషదాలు ఉన్నాయని వారు కనుగొన్నారు. అంతే కాకుండా మూర్ఛ వ్యాధికి కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుందని తెలియజేశారు.


రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా గ్యాస్‌తో పాటు చాలా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అందుకే శాస్త్రవేత్తలు ఎరువుల ధరలను తగ్గించే దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు. చాలావరకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కూడా దీని గురించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులు ఎక్కువగా ఆవుపేడను ఎరువుగా ఉపయోగించడం మొదలుపెట్టినా అది తగిన ఫలితాలను అందించలేకపోయింది. మనుషుల మలమూత్రాల నుండి తయారు చేసే ఎరువులు, కెమికల్ ఎరువుల సామర్థాన్ని అందుకోగలవని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ ఎరువులు మార్కెట్లోకి వస్తే దాదాపు 25 శాతం కెమికల్ ఎరువుల వాడకం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Big Stories

×