Redmi K80 series: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా తన హవా చూపిస్తోంది. అధునాతన ఫీచర్లతో కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇదివరకు లాంచ్ అయిన షియోమి కంపెనీ ఫోన్లకు మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు కంపెనీ తన లైనప్‌లో ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. Xiaomi తన కొత్త Note 14 Pro series స్మార్ట్‌ఫోన్‌ను ఈ వారంలో చైనాలో లాంచ్ చేయనుంది.
ఈ సిరీస్ తర్వాత Redmi ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో Redmi K80 సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. Redmi K80 లైనప్‌లో Redmi K80, Redmi K80 Pro మోడల్‌లు ఉంటాయని భావిస్తున్నారు. తాజాగా Redmi K80 సిరీస్‌కు సంబంధించిన కొన్ని లీక్‌లు బయటకొచ్చాయి. ఈ లీక్‌లు ద్వారా ఫోన్ స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. దీనిలో పెద్ద బ్యాటరీ ఉన్నట్లు తాజా లీక్ వెల్లడించింది. Redmi K80 గురించి పూర్తిగా తెలుసుకుందాం. Redmi K80 ఫ్లాగ్షిప్ వాటర్‌ప్రూఫ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.
అయితే దీనికి ముందు వెర్షన్ Redmi K70, Redmi K70 Pro మోడల్‌లలో ఎలాంటి వాటర్ఫ్రూఫింగ్ ఫీచర్ లేదు. కాబట్టి Redmi K80లో ఈ ఫీచర్‌ను పొందడం మంచి అప్‌గ్రేడ్ అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది IP68 లేదా IP69 రేటింగ్‌ను పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో టెలిఫోటో లెన్స్ ఉంటుందని చెప్పబడింది. ఈ టెలిఫోటో లెన్స్ మాక్రో షాట్లను కూడా షూట్ చేయడానికి వీలు కల్పిస్తుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు.
Also Read: వాసివాడి తస్సాదియ్య.. రూ.9,499 లకే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, డోంట్ మిస్ బ్రదరూ!
ఒకవేళ అదే జరిగితే టెలిఫోటో లెన్స్ లేకుండా ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉన్న Redmi K70కి ఈ Redmi K80 ఫోన్ మరొక అద్భుతమైన అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఫోన్ వెనుక భాగం గ్లాస్‌తో తయారు చేయబడిందని, వైట్ కలర్ దీనికి మంచి ఆప్షన్‌గా ఉంటుందని చెప్పబడింది. అలాగే ఈ ఫోన్ సామర్థ్యం విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ అతి పెద్ద 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్‌లో చెప్పబడింది. కాగా ఈ తరహా అతి పెద్ద బ్యాటరీలు 2024లో స్మార్ట్ఫోన్లకు ఎక్కువగా ట్రెండ్‌గా మారాయి. చాలా బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు ఈ రేంజ్లో బ్యాటరీలను కలిగి ఉన్నాయి.
Redmi Note 14 Pro Plus కూడా 6200mAh బ్యాటరీని పొందుతుందని తెలుస్తోంది. ఇక Redmi K80 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2K OLED డిస్ప్లేను కలిగి ఉంటుందని ఇప్పటికే లీక్ అయిన ఫీచర్లు చెబుతున్నాయి. ఇది ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ని కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. Redmi K80 స్మార్ట్‌ఫోన్ K80 ప్రోతో పాటు లాంచ్ అవుతుంది. ఇది అదే చిప్సెట్, డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ స్పెసిఫికేషన్లు మరికొద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.