EPAPER

Redmi Note 13R: రెడ్‌మీ టైమ్ స్టార్ట్.. ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో బడ్జెజ్ ఫోన్ లాంచ్!

Redmi Note 13R: రెడ్‌మీ టైమ్ స్టార్ట్.. ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో బడ్జెజ్ ఫోన్ లాంచ్!

Redmi Note 13R: Redmi Note 13 సిరీస్‌లో మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 12ఆర్‌ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా Redmi Note 13Rను అఫిషియల్‌గా లాంచ్ చేసింది. భారత్‌లో మార్కెట్‌లోకి కూడా ఈ ఫోన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ కెపాసిటీ, ​​డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌లకు అప్‌గ్రేడ్ చేసింది. Redmi Note 13R బ్యాక్ ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP53 రేటింగ్‌ ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకోండి.


Redmi Note 13R ఫీచర్ల గురించి మాట్లాడుతి ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ముందు మోడల్‌తో పోలిస్తే దాని డిస్‌ప్లేను అప్‌గ్రేడ్ చేసింది. Redmi Note 13 సిరీస్ ఈ ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Redmi Note 13R ఫోన్ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్ 50MP మెయిన్, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఈ Redmi ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 33W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ కనెక్టివిటీ కోసం 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ 5G SIM కార్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14తో హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతుంది.


Also Read: అదిరిపోయే డీల్.. రూ. 334లకే AI ఫీచర్ల స్మార్ట్‌ఫోన్..పెద్ద ప్లానింగే!

Redmi Note 13R ఐదు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ చేశారు. 6GB RAM + 128GB, 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB, 12GB RAM + 512GB. దీని బేస్ వేరియంట్ ధర RMB 1,399 అంటే సుమారు రూ. 16,400. అదే సమయంలో దాని ఇతర వేరియంట్‌ల ధర వరుసగా RMB 1,599 (సుమారు రూ. 18,500), RMB 1,799 (సుమారు రూ. 21,000), RMB 1,999 (సుమారు రూ. 23,400) మరియు RMB 2,190 (సుమారు రూ. 25,710.)

Tags

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×