EPAPER

Redmi 13 5G Price Leak: రెడ్‌మీ నుంచి బడ్జెట్ కిల్లర్.. ప్రీమియం ఫీచర్లు.. జులై 9న లాంచ్!

Redmi 13 5G Price Leak: రెడ్‌మీ నుంచి బడ్జెట్ కిల్లర్.. ప్రీమియం ఫీచర్లు.. జులై 9న లాంచ్!

Redmi 13 5G Price Leak: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi భారతదేశంలో Redmi 13 5Gని జూలై 9న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. విడుదలకు కొద్ది రోజుల ముందు, ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను ఓ టిప్‌స్టర్ ఎక్స్‌లో లీక్ చేశారు. డివైస్‌లో క్రిస్టల్ గ్లాస్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్ ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. లీక్ అయిన ధరతో పాటు, స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.


Redmi 13 5G Price
టిప్‌స్టర్ ప్రకారం హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ కావచ్చు. అందులో 6GB + 128GB, 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ ధర రూ. 13,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే 8 జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 15,999 కావచ్చు. ఫస్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1,000 క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే టిప్‌స్టర్ షేర్ చేసిన ధరలు ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా ఉన్నాయి.

Also Read: లాంచ్‌కు సిద్ధమైన CMF.. సోమవారమే లాంచ్.. ఎన్ని రంగులు మారుస్తుందో!


Redmi 13 5G గ్లాసీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పింక్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో వచ్చే డిజైన్‌లో ఉంది. అమెజాన్ లిస్టింగ్ “క్రిస్టల్ గ్లాస్ డిజైన్”ని హైలైట్ చేసింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో వస్తున్నప్పటీకి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. దీనిలో అతిపెద్ద డిస్‌ప్లే ఉంటుంది. ఇది పంచ్-హోల్ నాచ్ డిజైన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. Redmi 12 5G 6.79-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉన్నందున, కొత్త మోడల్‌లో ఇలాంటి లేదా కొంచెం పెద్ద డిస్‌ప్లే ఉంటుంది.

Redmi 13 5Gలో Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. Redmi 12 5Gలో ఉపయోగించిన అదే చిప్‌సెట్. ఇది Xiaomi కొత్త HyperOSలో రన్ అవుతుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీని ప్యాక్  కలిగి ఉంటుంది. రెడ్‌మీ 13 5G ధర రూ. 10,999 నుండి ప్రారంభమై రూ. 15,000 వరకు ఉండే అవకాశం ఉంది. జూలై 9 మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్‌లో దీని గురించి మరింత సమాచారం తెలుస్తుంది.

Also Read: ఆకర్షణీయమైన డీల్‌.. వివో 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల LCD FHD+ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో వెనుకవైపు LED ఫ్లాష్‌తో కూడిన 108MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌తో వస్తుంది. ఇది ఛార్జింగ్ కోసం హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్, USB టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కంపెనీ షియోమి రోబో వాక్యూమ్ క్లీనర్ ఎక్స్10, రెడ్‌మి బడ్స్ 5సి, షియోమి పాకెట్ పవర్ బ్యాంక్, పవర్ బ్యాంక్ 4ఐలను కూడా జూలై 9న పరిచయం చేయనుంది.

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×