EPAPER

Realme GT 6 Launch: వేరే లెవల్ మచ్చా.. రియల్‌మీ నుంచి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్.. AI ఫీచర్లతో ఆడేసుకోవచ్చు!

Realme GT 6 Launch: వేరే లెవల్ మచ్చా.. రియల్‌మీ నుంచి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్.. AI ఫీచర్లతో ఆడేసుకోవచ్చు!

Realme GT 6 Launch: Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme GT 6 గురించి చాలా కాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ ముగింపు ఇస్తూ కంపెనీ ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. ఇప్పుడు ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల చివరి వారంలో ఈ ఫోన్ ఇండియా, ఇటలీ, ఇండోనేషియా, స్పెయిన్, థాయ్‌లాండ్, మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, పోలాండ్, టర్కీ, సౌదీ అరేబియా తదితర దేశాల మార్కెట్‌లలోకి రానుంది. Realme GT6 కంపెనీ కొత్త ఫ్లాగ్‌షిప్ కిల్లర్. ఇది AI ఫీచర్‌తో వస్తున్న స్మార్ట్‌ఫోన్.


Realme నుంచి రాబోయే కొత్త ఫోన్ Realme GT 6 ను జూన్ 20న ఇండియాతో పాటు ఇతర దేశాలలో విడుదల చేయనుంది కంపెనీ. చైనీస్ మార్కెట్‌లో రియల్‌మే జిటి-సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను రియల్‌మీ రెగ్యులర్ అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే అన్ని GT-బ్రాండెడ్ ఫ్లాగ్‌షిప్‌లు గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కాలేదు. కంపెనీ GT 5 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇది డిసెంబర్ 2023లో చైనాలో ప్రారంభించింది.

Also Read: ఆఫర్లు, డిస్కౌంట్లు.. రూ.10 వేలల్లో బెస్ట్ ఫోన్లు ఇన్ని ఉన్నాయా.. ఏది కొనాలో తెలియడం లేదే!


ఇది కేవలం చైనా మార్కెట్‌కే పరిమితమైంది. గ్లోబల్ మార్కెట్ కోసం చివరి GT-సిరీస్ ఫోన్ Realme GT 3, ఇది జూలై 2023లో విడుదలైంది. ఇండియాలో చివరి GT-సిరీస్ ఫోన్ Realme GT నియో 3T, ఇది సెప్టెంబర్ 2021లో తీసుకొచ్చారు. అయినప్పటికీ Realme GT 6 లాంచ్‌తో బ్రాండ్ ఇప్పుడు Realme GT సిరీస్‌ను తిరిగి విస్తృత మార్కెట్‌లకు తీసుకువస్తోంది.

Realme GT 6 గ్లోబల్ స్పెసిఫికేషన్లను  Realme ఇంకా ధృవీకరించలేదు. అయితే ఫోన్ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయిన Realme GT 6కు సమానంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అనేక AI- పవర్డ్ ఫోటోగ్రఫీ ఫీచర్‌లతో వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: అంబానీ మామ బిగ్ గిఫ్ట్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏంటి అన్నయ్య ఇది!

Realme GT 6 Snapdragon 7+ Gen 3 పవర్డ్ Realme GT 6T కంటే ఎక్కువగా ఉంటుంది. దీని ధర రూ. 30,999 నుండి రూ. 39,999 మధ్య ఉంటుంది. ఆఫర్‌తో దీనిని రూ. 24,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. GT 6 ప్రారంభ ధర దాదాపు రూ. 40,000 ఉండవచ్చు.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×