EPAPER

Realme P1 smartphone : రూ.15 వేలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ – గేమింగ్, మల్టీటాస్కింగ్​ స్మార్ట్ ఫోన్​

Realme P1 smartphone : రూ.15 వేలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ – గేమింగ్, మల్టీటాస్కింగ్​ స్మార్ట్ ఫోన్​

Realme P1 smartphone : భారత్‌ మార్కెట్‌లో రీసెంట్​గా రియల్‌ మి నుంచి P1 స్పీడ్‌ స్మార్ట్‌ ఫోన్ 5G విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో నడుస్తుంది. 50 మెగా పిక్సల్​ ఏఐ కెమెరా, 45W ఛార్జింగ్‌ సపోర్టుతో వచ్చింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ నేడు అర్ధరాత్రి (అక్టోబర్‌ 20, 12AM) నుంచి ప్రారంభం కానుంది. దీనిని రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.


స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ – ఈ రియల్‌మి స్మార్ట్‌ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే కూడా ఉంది. 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OSతో నడుస్తుంది. ఇంకా గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం ప్రత్యేక ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ALSO READ:అమరావతి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం, మునిగింది అమరావతి కాదు.. యలహంక


కూలింగ్‌ ఛాంబర్ – ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Mail G615 GPU, 8 జీబీ లేదా 12 జీబీ LPDDR4x ర్యామ్‌, 128 జీబీ లేదా 256GB UFS 3.1 స్టోరేజీను సపోర్ట్ చేస్తుంది. 14 జీబీ వర్చువల్‌ ర్యామ్​ను కూడా సపోర్ట్​ చేస్తుంది. VC కూలింగ్‌ ఛాంబర్‌ కూడా ఉందులో ఉంది.

బ్యాటరీ విషయానికొస్తే 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ కెపాసిటినీ కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్​గా పని చేస్తుంది. సెక్యురిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ కూడా ఉంది. 5 జీ కనెక్టివిటీ, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6 వంటి ఫీచర్స్​తో పాటు స్టీరియో స్పీకర్లు, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ కూడా ఉన్నాయి.

కెమెరా ఫీచర్స్ – ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనక వైపు డ్యూయల్‌ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్​ AI ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్​ కెమెరా ఉంది. డ్యూయల్‌ వ్యూ వీడియో, నైట్‌ మోడ్‌, పోర్ట్రెయిట్‌ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16 మెగా పిక్సల్​ కెమెరాను అమర్చారు.

ధర, వేరియంట్లు – రియల్‌మి P1 స్పీడ్‌ 5G స్మార్ట్‌ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ వేరియంట్​ను రూ.17,999కు సొంతం చేసుకోవచ్చు. 12 జీబీ వేరియంట్​ను రూ.20,999కు కొనుగోలు చేయొచ్చు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ రెండు వేరియంట్‌లపై రూ.2000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అంటే ఈ హ్యాండ్ సెట్​ ప్రారంభ ధర రూ.15,999 గా ఉండనుంది.

Related News

Education commission : విద్యా కమిషన్‌కి సలహా కమిటీ.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్

IAS amoi Kumar : ‘అమ్మో’య్.. ఇన్ని అక్రమాలా? ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు

Smartphone sales : ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ పిచ్చి.. ఈ లెక్కలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే

Techno Phantom V fold 2 5G : టెక్నో మరో సంచలనం.. హై స్టాండర్డ్స్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంఛ్

Oneplus offline sales : వన్​ ప్లస్ ​లవర్స్​కు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆఫ్​లైన్​లోనూ సేల్స్​

Instagram : ఇన్​స్టాలో సరికొత్త ఫీచర్​ – సింగిల్ ట్యాప్​లో నచ్చిన సాంగ్​తో చిల్​!

Big Stories

×