EPAPER

Realme Note 60 : కొత్త రియల్ మి నోట్ 60 లాంచ్.. 6.74 అంగుళాల స్క్రీన్, 5,000mAh బ్యాటరీ.. ఇంకా ఎన్ని ప్రత్యేకతలో

Realme Note 60 : కొత్త రియల్ మి నోట్ 60 లాంచ్.. 6.74 అంగుళాల స్క్రీన్, 5,000mAh బ్యాటరీ.. ఇంకా ఎన్ని ప్రత్యేకతలో

Realme Note 60 : చైనా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లలో ఒకటైన రియల్ మి కంపెనీ కొత్త బడ్జెట్ వేరియంట్ రియల్ మి నోట్ 60 ని ఇండోనేషియాలో లాంచ్ చేసింది. దీని హ్యాండ్‌సెట్ Unisoc T612 చిప్‌సెట్‌పై నడుస్తుంది. ఇది గరిష్టంగా 8GB రామ్, 256GB స్టోరేజ్ తో రెండు కలర్స్, మూడు RAM కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ తోపాటు Realme Mini Capsule 2.0 ఫీచర్ ని పొందుపరిచారు. Realme Note 50లోని అనేక ఫీచర్లు Realme Note 60 లో కూడా ఉన్నాయి.


Realme Note 60 ధర
Realme Note 60 యొక్క బేస్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర IDR 13,99,000 (దాదాపు రూ. 7,500). 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్నవేరియంట్ ధర IDR 15,99,000 (దాదాపు రూ. 8,500) ఉండగా.. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్ల ధర IDR 18,99,000 (దాదాపు రూ. 10,000). ఈ వేరియంట్లన్నీ మార్బుల్ బ్లాక్ మరియు వాయేజ్ బ్లూ కలర్‌ వేస్‌లో లభిస్తాయి.

Realme Note 60 ప్రత్యేకతలు
Realme Note 60.. Android 14-ఆధారిత Realme UIపై నడుస్తుంది. ఇందులో సెల్ఫీ కెమెరా కటౌట్ చుట్టూ కొన్ని నోటిఫికేషన్‌లు చూపే కొత్త మినీ క్యాప్సూల్ ఫీచర్‌ ఉంది. ఇందులో 90Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 560నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్ల ‌తో 6.74-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంటుంది. ఈ డివైస్ ఆక్టా కోర్ Unisoc T612 చిప్‌సెట్‌ ఆధారంగా నడుస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 8GB రామ్, 256GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న వేరియంట్ లో లభిస్తుంది. అయితే వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో, నిరుపయోగంగా ఉన్న స్టోరేజ్‌ని ఉపయోగించి ఆన్‌బోర్డ్ ర్యామ్‌ను 16GB వరకు విస్తరించవచ్చు.


Also Read: ఆఫర్లే ఆఫర్లు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను ఇంత తక్కువకు కొనేయొచ్చా

ఆప్టిక్స్ కోసం, Realme Note 60 AI- బ్యాక్డ్ కెమెరా యూనిట్‌ని ఇందులో యూజర్ల కోసం పొందుపరిచారు. ఈ కెమెరాలో f/1.8 అపర్చర్‌తో పాటు 32-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలోని కెమెరాకు 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చారు. Realme Note 60 లో 10W ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీ ఉంది. దీని మందం 7.84mm, బరువు 187 గ్రాములు.

Also Read: కిక్కే కిక్కు.. మోటో ఫోన్‌పై రూ.10000 డిస్కౌంట్, ఆఫర్ అదిరిపోయిందంతే!

కొత్త Realme Note 60లోని కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, GPS USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. దుమ్ము, స్ప్లాష్ ను నిరోధించేందుకు IP64-రేటెడ్ బిల్డ్‌ను కూడా ఇందులో అమర్చారు. ఇందులో రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీ కూడా ఉండడం దీని ప్రత్యేకత. వినియోగదారులు వర్షంలో తడిసినప్పుడు లేదా వారి చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా ఈ ఫోన్ ని తయారు చేశారు.

Also Read: కొత్త కలర్‌లో రియల్‌మి ఫోన్ లాంచ్, రూ.3000 డిస్కౌంట్‌ కూడా, కెమెరా హైలైట్!

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×