EPAPER

Rajmargyatra : హైవేపై లాంగ్ జర్నీ చేస్తున్నారా? – ఇది మీతో ఉంటే ఫుల్ సేప్​!

Rajmargyatra : హైవేపై లాంగ్ జర్నీ చేస్తున్నారా? – ఇది మీతో ఉంటే ఫుల్ సేప్​!

Rajmargyatra : ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే కచ్చితంగా మ్యాప్​ను ఉపయోగిస్తుంటాం. అలానే ఫాస్టాగ్‌ రీఛార్జి చేయడానికి ఇంకో యాప్‌, జర్నీలో ఏమైనా సమస్య వస్తే కంప్లైంట్​ చేయడానికి మరొకటి.. ఇలా ఒక్కోదానికి మరొకదాన్ని ఆశ్రయిస్తుంటాం. మరి అన్నింటికీ కలిపి ఒకటే యాప్​ ఉంటే! ఇప్పుడు అందుకే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఓ సరికొత్త యాప్​ను తీసుకొచ్చింది. దాని పేరే రాజ్‌మార్గ్‌యాత్ర. ఇందులో రూట్‌ మ్యాప్స్‌ నుంచి స్మార్ట్‌ అలర్ట్స్‌ వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇంతకీ ఈ యాప్​లో ఏఏ ఫీచర్లు ఉంటాయి? వాటి వివరాలు ఏంటి? తెలుసుకుందాం.


రెస్టారెంట్ల నుంచి పెట్రోల్ బంక్​ల వరకు – నేషనల్ హైవే యాప్​పై వెళ్లేటప్పుడు తినడానికి రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్​లు, ఛార్జింగ్ స్టేషన్లు, హాస్పిటల్స్​, ఏటీఎంలు, పోలీస్ స్టేషన్లు, పర్యటక ప్రాంతాల వివరాలు ఉంటాయి. ఇంకా వాతావరణ స్థితి, ట్రాఫిక్‌ అలర్టులను కూడా చూపిస్తుంది. అలా ప్రయాణికులకు అవసరమయ్యే కీలక సమచారం ఈ యాప్​లో దొరుకుతుంది.

స్మార్ట్‌ అలర్ట్‌ – పరిమితికి మించి వేగంతో ప్రయాణించడం ప్రమాదకరణం. అయినా కొంతమంది అత్యుత్సాహం, లేదా ఇతర కారణాలతో వేగంగా వెళ్తుంటారు. ఇది మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ఓవర్‌ స్పీడ్‌ నోటిఫికేషన్‌ ఇస్తుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఎన్‌హెచ్‌ఏఐ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. యాప్​లో ఉన్న స్మార్ట్ అలర్ట్‌, వాయిస్‌ అసిస్టెంట్‌ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఈ నోటిఫికేషన్స్ వస్తాయి.


కంప్లైంట్ చేయొచ్చు – ప్రధాన జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు చాలా చోట్లు రోడ్లు సరిగ్గా ఉండకపోవచ్చు. దాని వల్ల ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుంది. ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి రహదారికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే ఈ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. Report An Issue On NHపై క్లిక్ చేసి సమస్యను ఫొటో, వీడియో తీసి కంప్లైంట్ చేయొచ్చు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటుంది. పైగా ఈ యాప్​లో మన కంప్లైంట్ స్టేటస్​ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ALSO READ : డేటా త్వరగా అయిపోతుందా? – ఇలా చేస్తే తక్కువ రిచార్జ్​ ప్లాన్​కే ఫుల్ డేటా!

టోల్‌ ప్లాజా డీటెయిల్స్​ – Toll Plaza Enroute ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అక్కడ సెర్చ్ బాక్స్​లో మీరు బయల్దేరుతున్న ప్రాంతంతో పాటు ఎక్కడికో వెళ్లాలో అంటే చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్‌ చేయాలి. సెర్చ్‌పై క్లిక్‌ చేస్తే చాలు. ఆ రహదారిలో ఉండే టోల్‌ ప్లాజాల సంఖ్య, వాటి పేర్లు, కట్టాల్సిన మొత్తం వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

ఫాస్టాగ్‌ సర్వీసులు – ఫాస్టాగ్‌ సర్వీసులు కూడా ఈ యాప్​లో అందుబాటులో ఉంటాయి. కొత్త ఫాస్టాగ్‌ దరఖాస్తును ఇందులో చేసుకోవచ్చు. అలానే నెలవారీ పాస్‌లు, ఫాస్ట్‌ ట్యాగ్‌కు సంబంధించిన ఇతర సర్వీసులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు.

ఇంకా ఏవేవి ఉంటాయంటే? – పోలీస్‌ అసిస్టెన్స్‌, ఎమర్జెన్సీ నంబర్లత పాటు హైవే అసిస్టెన్స్‌ కూడా యాప్​లో ఉంచాయి. అలా మనం జర్నీ చేస్తున్న రహదారి వివరాలు కూడా ఎప్పటి కప్పుడు కనిపిస్తుంటాయి. జర్నీని కూడా రికార్డ్‌ చేసుకోచ్చు. మొత్తంగా ఈ రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ తెలుగుతో పాటు ఇంగ్లిష్‌ సహా మొత్తం 12 భాషల్లో అందుబాటులో ఉంటుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోని, మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. అప్పుడు ఈ సదుపాయాలన్నీ పొందొచ్చు. యాపిల్‌ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.

 

Related News

Samsung Galaxy F05 : సూపర్ సేల్ బాస్.. రూ. 6,499కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

Data Recharge : డేటా త్వరగా అయిపోతుందా? – ఇలా చేస్తే తక్కువ రిచార్జ్​ ప్లాన్​కే ఫుల్ డేటా!

Best Smart Phones Under 10,000 : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Sunita Williams in Space: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Phone Battery : స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పాడైందని ఇలా కనిపెట్టేయండి..

Mobile Addiction : మొబైల్​కు బానిసలయ్యారా? – ఇలా చేస్తే ఇట్టే బయటపడొచ్చు!

Big Stories

×