EPAPER

Protect Your Phone From Thieves |మీ ఫోన్ దొంగిలించబడిందా?.. దొంగలు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఇలా చేయండి..

Protect Your Phone From Thieves |మీ ఫోన్ దొంగిలించబడిందా?.. దొంగలు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఇలా చేయండి..

Prevent Thieves From switching off your phone|  ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఒక్క రోజు కూడా ఉండలేరేమో. అంతగా జనం స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోయారు. ఒకవేళ ఫోన్ ఒక రోజు పనిచేయలేకపోయినా.. లేదా కనిపించకపోయినా ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.


ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలుంటాయి. అతని ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బిజినెస్ కాంటాక్ట్స్ ఉంటాయి. అతని ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ.. వ్యాట్సాప్ మెసేజ్ చాటింగ్ హిస్టరీ అన్నీ అందులో ఉంటాయి. అలాంటిదే ఫోన్ ఎవరైనా దొంగతనం చేస్తే.. ఈ సౌకర్యాలన్నీ ఉండవు. ఫోన్ దొంగిలించిన వెంటనే ఆ దొంగ ఫోన్ ని ఎవరూ ట్రాక్ చేయకుండా వెంటనే స్విచాఫ్ చేస్తాడు.

ఇలాంటి సందర్భంలో ఫోన్ ఎవరైనా దొంగతనం చేస్తే.. ఆ దొంగ ఫోన్ వెంటనే స్విచాఫ్ చేయకుండా నివారించవచ్చు. అలా చేసేందుకు ఫోన్ లో సెట్టింగ్స్ ఉన్నాయి.


ఫోన్ ఎవరూ స్విచాఫ్ చేయకుండా ఈ స్టెప్స్ పాటించండి:

1. ఫోన్ సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి
2. సెట్టింగ్స్ లో ప్రైవేసీ ని సెలెక్ట్ చేయండి
3. ప్రైవేసీలో ‘అన్ లాక్ టు పవర్ ఆఫ్’ ఆప్షన్ చేయండి

ఈ ఫీచర్ యాక్టివేట్ చేసిన తరువాత దొంగలెవరూ మీ ఫోన్ ని డైరెక్టుగా స్విచాఫ్ చేయలేరు. దీంతో ఒకవేళ మీ ఫోన్ దొంగతన జరిగితే మీకు ఫోన్ ట్రాక్ చేసేందుకు సమయం దొరుకుతుంది.

ఫోన్ ట్రాక్ చేయడానికి. ‘గూగుల్ ఫైండ్ మై డివైస్’ ఉపయోగపడుతుంది. అందుకోసం మీ ఫోన్ లో ‘గూగుల్ ఫైండ్ మై డివైస్’ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఫోన్ కు బలమైన పాస్ వర్డ్ పెట్టుకోవడం ఉత్తమం. లేదా ఫోన్ లాక్ కోసం మీ బయోమెట్రిక్స్ ఉపయోగించండి. మీ ఫోన్ డేటా రెగులర్ గా బ్యాకప్ చేయండి. ఈ సింపుల్ సెట్టింగ్స్ చేయడం వల్ల మీ ఫోన్ కు ఎక్స్ ట్రా సెక్యూరిటీ ఉంటుంది. దొంగతనం జరిగితే దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు.

Also Read: మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గనున్న రీఛార్జ్ రేట్లు!

 

Related News

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Big Stories

×