EPAPER

Pothole Rating App : బెంగుళూరు టెకీ వినూత్న ఆలోచన.. రోడ్లపై గుంతలకో యాప్

Pothole Rating App : బెంగుళూరు టెకీ వినూత్న ఆలోచన.. రోడ్లపై గుంతలకో యాప్

Pothole Rating App : దేశ వ్యాప్తంగా రహదారులు ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ గుంతల సమస్య మాత్రం పరిష్కారం కావటంలేదు. ఎక్కడికి అక్కడ రహదారులపై కనిపిస్తున్న గుంతలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. అభివృద్ధి చెందిన నగరాలతో పాటు టాప్ సిటీలో సైతం ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై ఎన్ని కంప్లైంట్స్ వచ్చినప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తున్నప్పటికీ సమస్య తీరటం లేదు. ఇక ఐటీ హబ్ గా ఎంతో అభివృద్ధి చెందిన బెంగళూరులో సైతం ఈ సమస్య లేకపోలేదు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాను అంటూ ఓ వ్యక్తి హాస్యాస్పదంగా ట్విట్టర్ వేదికగా తెలిపాడు.


నిత్యం లక్షల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్, ఉద్యోగస్తులు బెంగుళూరు మహా నగరంలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి చోట రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజు రోజుకి రహదారులపై గుంతల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటంతో ఎంతో అభివృద్ధి చెందిన ఈ నగరం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. స్థానికులు నిత్యం ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ యంత్రాంగం ఎంతగా శ్రమించినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గుంతలకు రేటింగ్ ఇస్తూ సమీక్షించడం కోసం ఒక యాప్ ను అభివృద్ధి చేస్తానని తెలుపుతూ తన ప్రణాళికలను ప్రకటించాడు.

Also Read : అదిరిపోయే ఆఫర్.. ఆ స్మార్ట్ ఫోన్స్ కు లైఫ్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్


కొన్నాళ్ళుగా ఈ రోడ్ల పరిస్థితిని చూసి విసిగిపోయిన ఎక్స్పెన్వివ్ మేనేజ్మెంట్ కంపెనీ కో ఫౌండర్ శివరామకృష్ణ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా రహదారులపై గుంతలు చూస్తూ విసిగిపోతున్నానని తెలుపుతూ ఈ  గుంతలను రేట్ చేసి సమీక్షించే యాప్ ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే ఓ పెద్ద గుంతను చూసినప్పటికీ దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని తెలిపారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్ట్ పై స్పందిస్తున్న నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజంగా అద్భుతమైన ఆలోచన.. గుంతలను రేట్ చేయటం ఎంతో అత్యవసరమైన పరిస్థితి అంటూ తెలిపారు. మరికొందరు ప్రతీ గుంతకు ఒక ఐడి నెంబర్ ఇవ్వాలని.. నగరం దాని పిన్ కోడ్ తో గుర్తించే విధంగా ఉంటే సమస్యకు పరిష్కారం తొందరగా కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి యాప్ ఒకటి అందుబాటులోకి వస్తే రోడ్లపై ఉండే గుంతల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని నెటిజన్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల పరిస్థితిని మార్చే యాప్స్ రావడం అత్యవసరం. నిత్యం ప్రయాణించే రోడ్ల స్థితిగతులు సరిగ్గా ఉండకపోవటంతో ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎందరో చనిపోయారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇందుకు పెద్ద పెద్ద నగరాలు సైతం మినహాయింపు కాదనే విషయం ఈ పోస్టు తో మరోసారి నిరూపితమైంది.

 

Related News

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

LG Smart LED TV Offers : ఎల్ జీ అరాచకం.. స్మార్ట్ టీవీపై మరీ ఇంత తగ్గింపా.. కొనాలంటే మంచి రోజులివే!

OPPO Find X8 series : ఒప్పో భీభత్సం.. కొత్త అప్డేట్స్ తో మరో రెండు ఫోన్స్.. కెమెరా, ప్రాసెసర్ మాత్రం సూపరో సూపర్

Whats App : వాట్సాప్ లో చిన్న సెట్టింగ్ మార్పుతో ఐదుగురికి కాదు.. ఒకేసారి అందరికీ శుభాకాంక్షలు పంపొచ్చని తెలుసా!

Diwali LED TV Offers : దీపావళి సేల్​ అంటేనే చీపెస్ట్ సేల్.. సగానికి సగం తగ్గిపోయిన సామ్ సాంగ్, సోనీ టీవీ ధరలు

Infinix Zero Flip 5G : Infinix ఫోల్డబుల్ మెుబైల్.. నేడే ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ సేల్.. ఫోన్ కొని ఎంచక్కా పాకెట్లో దాచేయండి

Diwali Mobile Sale : భారీగా తగ్గిపోయిన ఫోన్ ధరలు.. 10వేలకే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్

Big Stories

×