EPAPER

POCO M7 5G: మార్కెట్‌లోకి మరో చీపెస్ట్ ఫోన్.. త్వరలో లాంచ్‌కి రెడీ!

POCO M7 5G: మార్కెట్‌లోకి మరో చీపెస్ట్ ఫోన్.. త్వరలో లాంచ్‌కి రెడీ!

POCO M7 5G: ఈ మధ్య కాలంలో 5 నెట్‌వర్క్ ఫోన్లు బాగా ఎక్కువైపోయాయి. అందువల్లనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీలన్నీ ఆ తరహా ఫోన్లనే రిలీజ్ చేస్తున్నాయి. కానీ వాటి ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులకు భారంగా మారింది. దీంతో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 4జీ ఫోన్లను కొనుక్కుంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే చీప్ ధరకే ఓ కంపెనీ 5జీ ఫోన్లను లాంచ్ చేస్తూ సామాన్యులను ఆకట్టుకుంటుంది. ఆ కంపెనీ మరేదో కాదు పోకో. చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి అనుబంధ సంస్థ అయిన పోకో భారతదేశంలో అతి తక్కువ ధరలో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది.


ఇప్పటికి POCO M6 5G, POCO M6 Pro 5G వంటి ఫోన్లను అతి తక్కువ ధరలో లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసింది. కంపెనీ త్వరలో దాని తదుపరి స్మార్ట్‌ఫోన్‌ను POCO M7 5Gని విడుదల చేయడానికి రెడీగా ఉంది. ఈ నెలలో భారతదేశంలో ప్రారంభించబడుతుందని XiaomiTime పేర్కొంది. ఈ నేపథ్యంలో లాంచ్‌కు ముందే ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Redmi 14C 5G తరహాలోనే ఈ ఫోన్ ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు.

కంపెనీ ఈ ఫోన్‌ను భారత్‌లో ప్రత్యేకంగా విడుదల చేయనుంది. అంటే గ్లోబల్ మార్కెట్‌లో ఇది ప్రవేశపెట్టబడదు. రాబోయే POCO ఫోన్ ఎలా ఉంటుందో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. POCO M7 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ నెలలో భారతదేశంలో ప్రారంభించబడుతుందని చెబుతున్నారు. ఈ తరుణంలో ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. POCO M7 5G స్పెసిఫికేషన్లు Redmi 14C 5G ఫోన్‌ లాగా ఉంటాయని చెప్పబడింది. అంతేకాకుండా HyperOS లిస్టింగ్ ప్రకారం.. ఫోన్ ఈ మోనికర్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ కూడా POCO M6 5G మాదిరిగానే కేవలం రూ.10 వేల లోపు లాంచ్ అవుతుందని సమాచారం.


Also Read: 108MP కెమెరా ఫోన్ వచ్చేస్తుంది.. ఇవేం ఫీచర్లరా బాబు, మతిపోయేలా ఉంది!

కాగా POCO M7 5G ఫోన్ flame_p అనే కోడ్‌నేమ్‌తో దర్శనమిచ్చింది. అంతేకాకుండా ఇది 24108PCE2I మోడల్ నంబర్‌తో మార్కెట్‌లోకి రానుందని చెప్పబడింది. ఇక్కడ ఉన్న ఈ కోడ్‌నేమ్ ఫ్లేమ్ Redmi 14R, Redmi 14C 5Gకి సంబంధించినది అని చెప్పబడింది. అయితే ఇక్కడ P అంటే Poco అని అర్థం. అంటే Redmi 14R, Redmi 14C 5G రీబ్రాండ్‌ వెర్షన్‌గా ఇది రాబోతుంది. కంపెనీ ఇంతకు ముందు ఈ లైనప్‌లో POCO M6 5Gని ప్రారంభించింది. POCO M6 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వచ్చింది.

ఫోన్ 600నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇందులో MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ ఉంది. దీనితో గరిష్టంగా 8 GB RAM + 256 GB స్టోరేజ్‌ అందించబడింది. అదే సమయంలో మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUI 14 పై రన్ అవుతుంది. ఇది వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×