EPAPER

Phone Pay Diwali Insurence : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ

Phone Pay Diwali Insurence : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ

Phone Pay Diwali Insurence : అనుకోని ప్రమాదాలు, అనారోగ్యాలు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరోగ్య బీమా పాలసీలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే అతి పెద్ద యుపీఐ ప్లాట్ ఫామ్ ఫోన్ పే కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యమై ఫోన్ పే ఇన్సూరెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇన్సూరెన్స్ కోసం ఫోన్ పే మంత్లీ పేమెంట్ ఆప్షన్ వంటిది కూడా ఆవిష్కరించింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో నెలవారి పేమెంట్ ఆప్షన్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.


వారి కోసం కొత్త తరహా పాలసీ – అయితే తాజాగా మళ్లీ కొత్త తరహా బీమా పాలసీని తీసుకొచ్చింది. టపాసుల పండగను దృష్టిలో పెట్టుకుని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో కలిసి దీన్ని తీసుకొచ్చింది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే క్రమంలో గాయపడే వారి కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది ఫోన్ ఫే. గాయపడిన వారికి బీమా కల్పించే ఉద్దేశంతోనే ఫోన్‌ పే ఈ కొత్త తరహా బీమా పాలసీని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

ప్రమాదవశాత్తూ ఎవరైనా ఈ టపాసుల వల్ల గాయ పడితే వారికి ఈ బీమా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చింది ఫోన్ పే. కేవలం రూ.9 చెల్లించడం ద్వారా రూ.25 వేల వరకు కవరేజీ లభిస్తుందని… ఫోన్ పే కస్టమర్స్ కు ఈ అవకాశం ఉందని ఫోన్​ ఫే ఓ ప్రకటనలో అధికారికంగా తెలిపింది.


ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ? – అక్టోబర్‌ 25 నుంచి 10 రోజుల పాటు ఈ బీమా కవరేజీ లభిస్తుంది. ఫోన్‌ పే యూజర్‌తో పాటు భార్య పిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర కవరేజీ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని ఫోన్‌ పే తెలిపింది. అక్టోబర్‌ 25 తర్వాత ఏ రోజు కొనుగోలు చేస్తే, ఆ రోజు నుంచి వారికి పాలసీ కవరేజీ ప్రారంభం అవుతుంది.

ALSO READ : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

ఎలా కొనుగోలు చేయాలంటే? – ఈ కొత్త తరహా పాలసీని తీసుకోవాలనుకునేవారు ముందుగా ఫోన్‌ పేలోని ఇన్సూరెన్స్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘ఫైర్‌ క్రాకర్‌ ఇన్సూరెన్స్​ను’ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మనకు సంబంధించిన వివరాలు ఇచ్చి కొత్త పాలసీని కొనుగోలు చేయాలి. అప్పుడు ఆ కొత్త పాలసీ మనకు వర్తిస్తుంది.

క్లెయిం తిరస్కరించకుండా ఉండాలంటే? – కేవలం ఈ దీపావళి కొత్త బీమా పాలసీనే కాదు ఇతర సమయం, సందర్భాల్లోనూ బీమా పాలసీలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఎప్పుడైనా సరే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలనుకుంటే మీ వైద్య చరిత్ర గురించి మొత్తం కచ్చితమైన సమాచారాన్ని ఇన్సూరెన్స్​ ఇచ్చేవారికి అందించాలి. ఆరోగ్య వివరాలు దాచిపెట్టి, పాలసీ తీసుకోకూడదు. లేదంటే తర్వాత ఇబ్బందులు వస్తాయి. మీ క్లెయింను తిరస్కరించే ఆస్కారం కూడా ఉంటుంది. చివరిగా అసలు ఓ ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు దానికి సంబంధించిన అన్ని నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవడం ఎంతో ఉత్తమం. పాలసీ పత్రంలో ఉన్న వివరాలను ఒకటికి రెండు సార్లు బాగా చదివి పరిశీలించుకోవాలి.

Related News

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Commercial Space Station: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

Instagram Followers : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

Big Stories

×