EPAPER
Kirrak Couples Episode 1

Peaklight Effect : పైరెటెడ్​ మూవీస్​ను డౌన్​లోడ్ చేస్తున్నారా? – ఇక మీ పని అంతే…

Peaklight Effect : పైరెటెడ్​ మూవీస్​ను డౌన్​లోడ్ చేస్తున్నారా? – ఇక మీ పని అంతే…

Peaklight Effect : సాధారణంగా చాలా మంది మూవీ లవర్స్​ పైరేటెడ్ సినిమాలను డౌన్​లోడ్​ చేసి చూస్తుంటారు. అయితే ఇది కరెక్ట్​ కాదని తెలిసినప్పటికీ పెరిగిన థియేటర్ టికెట్​ రేట్లు సహా ఇతర కారణాల వల్ల వీటిపై సినీ ప్రేమికులు మొగ్గు చూపిస్తుంటారు. అయితే ఈ మధ్య పీక్ లైట్ అనే కొత్త మాల్వేర్ స్ట్రెయిన్ గురించి గూగుల్​కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ యూజర్స్​ను వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఈ కొత్త పీక్ లైట్ మాల్వేర్​ ముఖ్యంగా పైరేటెడ్ మూవీలను డౌన్ లోడ్ చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకుంటోందట. అలానే యూజర్స్ ఊపయోగించే ఎలక్ట్రానిక్ డివైజెస్, విండోస్ కంప్యూటర్స్​లోకి హానికరమైన సాఫ్ట్​వేర్​ను చొప్పించి తీవ్రంగా నష్టపరుస్తుందని పేర్కొంది.


అసలు ఈ పీక్ లైట్ మాల్వేర్ ఏమిటంటే? – గూగుల్​కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం పీక్ లైట్ మాల్వేర్ కంప్యూటర్ మెమరీలో సీక్రెట్​గా వర్క్ చేస్తుంటుంది. హార్డ్ డ్రైవ్​లో దీనిని గుర్తించడం ఎంతో కష్టం, సవాలుతో కూడిన పని. ఎందుకంటే ఇది హార్డ్​ డ్రైవ్​లో తనకు సంబంధించి ఎటువంటి జాడను కూడా విడిచిపెట్టడు. ఇది మెమరీలో పవర్ షెల్ – ఆధారిత డౌన్ లోడర్​ను లక్ష్యంగా చేసుకుని పని చేస్తుంటుంది. అందుకే పరిశోధకులు దీనిని పీక్ లైట్ అని పిలుస్తుంటారు. తద్వారా ఈ డౌన్ లోడర్ సంబంధిత సిస్టమ్​, లేదా డివైస్​లోకి హానికరమైన సాఫ్ట్​వేర్​ను పంపిస్తుంది. ఇది వినియోగదారులకు మరింత రిస్క్​ను పెంచుతుంది.

ALSO READ : ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ ఛాయిస్ మిస్ అయిపోతే ఎలా మరి!


మాల్​వేర్​ను ప్రవేశపెట్టడానికి – పీక్ లైట్ మాల్వేర్ సోకిన డివైజ్​లలో మరిన్ని మాల్​వేర్​లను ప్రవేశపెట్టడానికి కోవర్ట్ పవర్ షెల్ స్క్రిప్ట్​ను ఉపయోగిస్తుందని మాండియంట్ పేర్కొంది. అలానే లుమ్మా స్టీలర్, హైజాక్ లోడర్, క్రిప్ట్‌ బాట్‌తో సహా ఇతర హానికరమైన ప్రోగ్రామ్‌లను చొప్పిస్తుంది. సైబర్ నేరస్థులు దీనిని సులభంగా వినియోగించేలా ఇది పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఆయా డివైజ్​లలోని సున్నితమైన డేటాను దొంగిలించడానికి లేదా ఇతర ప్రముఖ, ప్రభావిత వ్యవస్థలను తమ నియంత్రణలోని తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

సైబర్ నేరగాళ్లు పీక్ లైట్​ను ఎలా వినియోగిస్తారు? – పీక్ లైట్​ను సీక్రెట్​గా డివైజెస్​లలోకి పంపించేందుకు సైబర్ నేరగాళ్లు పైరెటెడ్​ మూవీ డౌన్​లోడ్​లను ఎంచుకుంటున్నారు. సూపర్ హిట్ సినిమాల వలే కనిపించే జిప్ ఫోల్డర్​లలో ప్రమాదకరమైన విండోస్ షార్ట్ కట్ ఫైల్స్​ను (LNK) దాచి పెడతారు. ఆ ఫైళ్లను మనం ఓపెన్ చేసినప్పుడు అవి మన సిస్టమ్​లోకి వెళ్లిపోతాయి.

1. హిడెన్ సోర్స్​కు కనెక్షన్ – LNK ఫైల్ కంటెంట్ డెలివరీ నెట్ వర్క్ (CDN)కు ఒక లింక్​ను ఏర్పాటు చేస్తుంది. అక్కడ హానికరమైన జావా స్క్రిప్ట్ కోడ్​ను ఇది పొందుతుంది. హార్డ్ డ్రైవ్​లోని డిటెక్షన్​ను బైపాసింగ్​ చేస్తూ ఈ హానికరమైన జావా స్క్రిప్ట్​ కోడ్ నేరుగా కంప్యూటర్ మెమరీలోకి వెళ్లి తన హానికరమైన పనిని చేస్తుంది.

2. డౌన్​లోడర్​ యాక్టివేషన్ – పీక్ లైట్ అనే పవర్ షెల్ స్క్రిప్ట్​ను జావా స్క్రిప్ట్ ట్రిగ్గర్ చేస్తుంది. ఇది మాల్వేర్​ను వ్యాప్తి చేయడానికి సులభతరంగా పనిచేస్తుంది.

3. ముప్పును మరింత పెంచడం – డౌన్​లోడర్​గా వ్యవహరించే పీక్ లైట్, రిమోట్ సర్వర్ నుంచి లుమా స్టెల్లర్, హైజాక్ లోడర్, క్రిప్ట్ బాట్ వంటి ప్రోగ్రామ్​ మాల్​వేర్​ను పొందుతుంది. ఇవి ఆయా సిస్టమ్, డివైజ్​లలోని వినియోగదారి సున్నితమైన డేటాను తస్కరిస్తుంది. సిస్టమ్​పై దాడి చేసి వాటిని హ్యాకర్ల నియంత్రణలోకి పంపుతుంది.

ఫైనల్​గా కంప్యూటర్ మెమరీ లోపల పీక్ లైట్ తన సీక్రెట్​ ఆపరేషన్​ను కొనసాగిస్తుంటుంది. దీనిని సాధారణ యాంటీవైరస్​ల ద్వారా గుర్తించడం, నివారించడం చాలా కష్టం. కాబట్టి పీక్ లైట్ వంటి మాల్వేర్​ బారిన పడకుండా ఉండేందుకు అనధికార సోర్స్​ల నుంచి కంటెంట్​ను డౌన్​లోడ్​ చేయడం మంచిది కాదు. కాబట్టి వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

Related News

Computer Accessories Online : సూపర్ డీల్ భయ్యా.. కీబోర్డ్, మౌస్, హెడ్‌సెట్స్ పై 76% తగ్గింపు.. ఇంకా ఏం ఉన్నాయంటే!

Trolley Bags Large Size Lowest Price : ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ ఛాయిస్ మిస్ అయిపోతే ఎలా మరి!

Apple Product Offers : ఆండ్రాయిడ్ ఎందుకు దండగా.. ఏకంగా ఐఫోనే కొనేయండి, ఆ తేదీ నుంచి యాపిల్ పండగ ఆఫర్లు

Flipkart Credit Card Offers 2024 : ఈ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? చాలా చౌకగా షాపింగ్ చేసేయొచ్చు.. ఇలా చెయ్యండి చాలు

Google Pixel 8 price : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో కళ్లు చెదిరే ఆఫర్​ – గూగుల్ పిక్సల్​ 8 మరీ ఇంత తక్కువ ధరకా?

Best Gadgets Under 500 In Flipkart : ఇదేం సేల్ అయ్యా బాబు.. మరీ ఇంత చీపా.. రూ.500లోపే ఎన్ని గాడ్జెట్స్​ కొనొచ్చో!

Big Stories

×