EPAPER

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Oppo Find X8 series: చైనీస్ టెక్ బ్రాండ్ Oppo వరుస ఫోన్లు లాంచ్ చేస్తూ ప్రపంచ మార్కెట్, దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. రకరకాల మోడళ్లను పరిచయం చేస్తూ ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తుంది. ఇప్పటికి తన లైనప్‌లో ఉన్న చాలా ఫోన్లను లాంచ్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు మరో మోడల్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే Oppo Find X8 సిరీస్‌పై పని చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని లీక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయి చక్కర్లు కొడుతున్నాయి.


వాటి ప్రకారం.. రాబోయే Oppo Find X8 సిరీస్ చైనీస్ మార్కెట్ కోసం నాలుగు మోడళ్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అందులో Find X8, Find X8 Pro, Find X8 Pro Satellite Communication Version, Find X8 Ultra వంటి మోడల్స్ ఉన్నాయి. వీటిలో అల్ట్రా మోడల్ జనవరి 2025లో అధికారికంగా లాంచ్ చేయబడుతుందని చెప్పబడింది. అదే సమయంలో ఇతర వేరియంట్‌లను వచ్చే నెల అంటే అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కొత్త లీక్‌లో టిప్‌స్టర్ Find X8 సిరీస్ బ్యాటరీ సామార్థ్యం, ఛార్జింగ్ సామర్థ్యాన్ని వెల్లడించారు. Oppo Find మూడు హ్యాండ్‌సెట్‌లు 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ మొబైల్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రానున్నాయని తెలిపారు. అయితే ప్రో వెర్షన్ మాత్రం 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో వస్తుందని చెప్పబడింది. ప్రస్తుతం వనిల్లా మోడల్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఇదిలా ఉంటే ఫైండ్ X8 అల్ట్రా పెద్ద 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.


Also Read: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

ఇది కాకుండా ఇది 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు ఈ నాలుగు ఫోన్ల మోడల్ నంబర్‌లను సూచిస్తున్నాయి. అందులో వరుసగా Find X8, Find X8 Pro, Find X8 Pro శాటిలైట్ కమ్యూనికేషన్ ఎడిషన్ కోసం PKB110, PKC110, PKC130 మోడల్ నంబర్‌లను కలిగి ఉన్నాయి.

ఇక Oppo నుంచి రాబోయే మూడు ఫోన్‌లు 80W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో Find X8కి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. వాటి ప్రకారం.. ఫ్లాట్ డిస్‌ప్లేతో రౌండ్ కార్నర్స్, సూపర్ స్లిమ్ బెజెల్స్‌‌ను కలిగి ఉన్నాయి. Find X8 దాదాపు 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా డైమెన్షన్ 9400 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో రానుంది. కెమెరా విషయానికొస్తే.. ఇది 50-మెగాపిక్సెల్, 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా సెటప్‌తో పాటు వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×