EPAPER

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Oppo : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ సరికొత్త అప్డేట్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకురావడానికి పోటీ పడుతూ ఉంటాయి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లో మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫోన్స్ రిలీజ్ చేస్తుంటాయి. అయితే ఎన్ని అప్డేట్స్, ఫీచర్స్ తో లేటెస్ట్ మొబైల్స్ మార్కెట్లోకి విడుదలైనప్పటికీ వినియోగదారులను సంతృప్తి పరిచేది మాత్రం సర్వీసే. ప్రముఖ సంస్థలన్నీ తమ కస్టమర్స్ ను సంతృప్తి పరచడానికి తమ సర్వీసులను రాజీ పడకుండా ఇస్తూ ఉంటాయి. అయితే ఇందులో అత్యుత్తమ సర్వేస్ను  అందిస్తున్న సంస్థగా ఒప్పో ఇండియా నెంబర్ 1 స్థానంలో నిలిచింది.


కస్టమర్స్ ను సంతృప్తి పరచడంతో పాటు సేల్స్ తర్వాత సర్వీస్ సక్రమంగా అందిస్తున్న స్మార్ట్ ఫోన్ సంస్థగా ఒప్పో ఇండియా భారత్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్స్ పై ఏకంగా 62 శాతం మంది కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వీస్ ఎంతో బావుందని.. సమస్యను సర్వీస్ సెంటర్స్ చక్కగా పరీక్షకరిస్తున్నాయని తెలిపారు.

కౌంటర్ పాయింట్ అనే సంస్థ… సేల్స్ తర్వాత సర్వీస్ అనుభవాన్ని అంచనా వేయటమే లక్ష్యంగా ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో రియల్ మీ, సామ్ సాంగ్, షావోమీ, వివో, ఒప్పో ఇండియా వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కస్టమర్స్ పై నిర్వహించింది. ఇక ఈ సర్వేలో అత్యుత్తమ సర్వీసేస్ అందిస్తున్న సంస్థగా ఒప్పో ఇండియా తొలి స్థానంలో నిలిచింది.


ALSO READ : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

దేశంలోని ప్రముఖ సిటీలలో కౌంటర్ పాయింట్ ఈ సర్వే ను చేపట్టగా… సుమారు 200 మంది వినియోగదారులు ఇందులో పాల్గొన్నారు. సిబ్బంది పనిచేసే తీరు, నైపుణ్యం, రిపేర్ క్వాలిటీ వంటి అంశాల్లో ప్రశ్నించగా ఒప్పో విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నామని సర్వీస్ సెంటర్ సక్రమంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఏకంగా 62 శాతం మంది వినియోగదారులు సానుకూలంగా రేటింగ్ ఇవ్వడంతో ఇండియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక తన ఫోనుకు సంబంధించిన రిపేర్స్ ను ప్రత్యక్షంగా చూసేందుకు సైతం అనుమతించడంతో ఒప్పో ఇండియాలో 78% కస్టమర్స్ సంతృప్తిని వ్యక్తపరిచారు. సిబ్బంది సైతం కస్టమర్స్ తో ఎంత అనుకూలంగా మాట్లాడారని.. అవసరమైన ప్రతీ విషయాన్ని ప్రత్యేకంగా గమనించి చెప్పారని చెప్పుకొచ్చారు. ఇక దేశంతోనే 500కు పైగా నగరాల్లో ఒప్పో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతీ సర్వీస్ సెంటర్ లో సర్వీస్ సక్రమంగా ఉంటుందని కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని చెప్పుకొచ్చారు. ఇక సర్వీస్‌ సెంటర్‌లకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒప్పో సెల్ఫ్‌ హెల్ప్ అసిస్టెంట్‌.. స్పార్ట్‌ఫోన్‌ సమస్యలను పరిష్కరించడంలోనూ వినియోగదారులకు సంతృప్తినిస్తుంది.

సర్వీస్ సెంటర్ కి వచ్చిన కేవలం గంట వ్యవధిలోనే 35% మంది కస్టమర్స్ సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇక 51 శాతం మంది రిపేర్ ఖర్చులపై సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రముఖ కంపెనీ వివో కస్టమర్స్ 58% సంతృప్తిని వ్యక్తపరచగా తర్వాత స్థానంలో శాంసంగ్ ఉంది. సామ్ సాంగ్ ఫోన్స్ కొన్న 57 శాతం మంది కస్టమర్ సర్వీసెస్ సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Related News

DigiYatra Airport : ఇకపై విదేశీ ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Big Stories

×