EPAPER

Oppo Find X8 : కిర్రాక్ ఫీచర్స్ తో ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Oppo Find X8 : కిర్రాక్ ఫీచర్స్ తో ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Oppo Find X8 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Oppo మరో లేటెస్ట్ మెుబైల్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావటానికి సిద్ధమైంది. Oppo Find X8 సిరీస్ ను అక్టోబర్ 24న చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఇక తాజాగా విడుదలైన వీడియో దాని AI లక్షణాలను తెలపగా.. అదిరే పోయే అప్డేట్స్ తో రాబోతుందని టెక్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Oppo Find X8 సిరీస్ అదిరి పోయే ఫీచర్స్ తో రాబోతుంది. స్పారో న్యూస్ యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రాబోయే ఫోన్ కి సంబంధించిన టీజర్‌లా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఇందులో Oppo Find X8 డిజైన్, ప్రాసెసర్ వివరాలు క్లియర్ గా ఉన్నాయి.

ఆపరేటింగ్ సిస్టమ్ – Oppo Find X8 సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రానుంది. ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ద్వారా పని చేస్తుంది. లీక్ అయిన కొన్ని AI ఫీచర్స్ సైతం అదిరిపోయాయి. అయితే ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.


Oppo Find X8 స్పెసిఫికేషన్స్ –

ఒప్పో Find X8  స్క్రీన్ డిజైన్ స్పెషల్ గా ఉంది. రౌండ్ కార్నర్, సన్నని బెజెల్‌లతో కూడిన ఫ్లాట్ ఫ్రేమ్‌ తో రాబోతుంది. ఈ ఫోన్ వెనక ప్యానెల్ ఫైండ్ X7 మోడల్ లో పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ తో రాబోతుంది.

డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. రాబోయే ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ ను మరింత అధునాతనంగా తీర్చిదిద్దారు. Oppo Find X8 సిరీస్ AI ఇంజిన్‌తో మీడియా టెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ తో రాబోతుంది.

ఇక ఫోన్ ఉత్పాదక AI సామర్థ్యాలు ఇన్స్టంట్ మెసెజ్ కోసం టెక్స్ట్ ఆధారిత స్టిక్కర్స్ ను జనరేటర్‌ చేస్తున్నాయి. AI ఇంజిన్ థర్డ్ పార్టీ యాప్స్ పని తీరును సైతం మెరుగుపరుస్తుంది.

డిస్‌ప్లే – Oppo Find X8 ఫోన్ 6.5 అంగుళాల BOE డిస్‌ప్లేతో రాబోతుంది. ఇక 1.5K రిజల్యూషన్, స్లిమ్ బెజెల్స్‌తో పాటు ప్రీమియం అనుభూతి గ్లాస్ రియర్ ప్యానెల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 సెన్సార్ తో డిజైన్ చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్ 16GB RAM, 1TB స్టోరేజీ తో రాబోతుందని అంచనా వేస్తున్నారు. 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ తో 5700mAh బ్యాటరీను కలిగి ఉండనుంది.

ఇక Oppo Find X సిరీస్, OnePlus ఫ్లాగ్‌షిప్ పరికరాలు ఒకే విధంగా ఉన్నాయి.  ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఒకే విధమైన హార్డ్‌వేర్ లక్షణాలను కలిగి ఉన్నాయి. దీంతో Oppo Find X8 50 మెగా పిక్సెల్ Sony LYT-600 సెన్సార్, 5700mAh బ్యాటరీ ఫీచర్స్ నిజమైతే అదే ఫీచర్స్ తో OnePlus 13 కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక One Plus 13 కూడా అక్టోబర్‌లో చైనా మార్కెట్‌లో లాంఛ్ కాబోతున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ : జియో బంపర్ ఆఫర్.. 29 దేశాలకు ISD కాలింగ్.. కేవలం రూ.39కే

Related News

Jio ISD : జియో బంపర్ ఆఫర్.. 29 దేశాలకు ISD కాలింగ్.. కేవలం రూ.39కే

ICICI credit card : ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు షాక్.. ఇకపై కోత తప్పదు!

Social Media : తొలి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఇదే – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Internet : రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు… ఏ దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారంటే?

Tesla Robo : తగ్గేదేలేదంటున్న టెస్లా.. ఎలక్ట్రానిక్ రంగంలో మరో ముందడుగు.. రోబో వ్యాన్, రోబో టాక్సీ లాంఛ్

WhatsApp Scam: వాట్సాప్ లో నయా స్కామ్, ఇలా చేశారో అంతే సంగతులు!

Big Stories

×