EPAPER

OnePlus Nord 4 5G: వన్‌ప్లస్ నుంచి కొత్త మెస్మరైజింగ్ ఫోన్ రెడీ.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

OnePlus Nord 4 5G: వన్‌ప్లస్ నుంచి కొత్త మెస్మరైజింగ్ ఫోన్ రెడీ.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

OnePlus Nord 4 5G Launch on july 16 with Pad 2, Watch 2R and Nord Buds 3 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తరచూ కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఫీచర్లు పరంగా అప్డేటెడ్ వెర్షన్లను తీసుకొస్తూ ఫోన్ ప్రియులకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఇక ఇప్పుడు మరొక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్ 2024 జూలై 16న ఇటలీలోని మిలాన్‌లో జరగనుంది.


ఈ ఈవెంట్ నాలుగు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అందులో OnePlus Nord 4 5G, OnePlus Pad 2, OnePlus Watch 2R, OnePlus Nord Buds 3 Pro వంటి ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. కాగా త్వరలో లాంచ్ కాబోతున్న OnePlus Nord 4 5G మునుపటి OnePlus Ace 3V రీబ్రాండెడ్ వెర్షన్‌గా తెలుస్తుంది. కానీ ఈ కొత్త మొబైల్ వేరే డిజైన్‌ను కలిగి ఉంది. అదేవిధంగా వన్‌ప్లస్ ప్యాడ్ 2 కూడా వన్‌ప్లస్ ప్యాడ్ ప్రో రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

OnePlus Nord 4 5జీ స్మార్ట్‌ఫోన్ మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే OnePlus Nord Buds 3 Pro అనేది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మద్దతుతో మిడ్ రేంజ్‌తో రానుంది. దీంతోపాటు రిలీజ్ కానున్న OnePlus వాచ్ 2R తేలికైనదిగా ఉంటుంది. అలాగే ఇది Wear OSలో నడుస్తుందని కంపెనీ తెలిపింది. ఇక OnePlus Nord 4 5G ధర, ఫీచర్లు విషయానికొస్తే.. OnePlus Nord 4 5G భారతదేశంలో రూ.31,999 ధరతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.


Also Read: స్మార్ట్‌ఫోన్ల జాతర.. వచ్చేవారం లాంచ్ కానున్న ఫోన్ల లిస్ట్ ఇదే.. మొత్తం ఎన్నంటే..?

ఇది 6.74-అంగుళాల 1.5K OLED స్క్రీన్, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వచ్చే అవకాశముందని అంటున్నారు. అలాగే ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని తెలుస్తోంది.

ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీతో బ్యాకప్ చేసే ఛాన్స్ ఉంది. OnePlus Nord 4 5G లీకైన డిజైన్ రెండర్‌లు ఫోన్‌ను మూడు కలర్ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ 2 వివరాలు కూడా ఇటీవల లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ స్టైలో 2, స్మార్ట్ కీబోర్డ్, ఫోలియో కేస్‌తో పాటుగా ఈ టాబ్లెట్ భారతదేశంలో లాంచ్ అవుతుందని సమాచారం.

Tags

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×