EPAPER
Kirrak Couples Episode 1

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

OnePlus 13: చాలా మంది స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎక్కువ ర్యామ్, ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటారు. అలాంటి ఫోన్ కోసం తెగ వెతికేస్తుంటారు. కానీ ఎక్కడా కంటపడదు. మరి మీరు కూడా అలాంటి ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నట్లయితే.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ త్వరలో అలాంటి సామార్థ్యం గల ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.


OnePlus తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది దాదాపుగా 24 GB RAM వరకు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే 2K రిజల్యూషన్‌తో 6.8 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉండవచ్చు అని చెప్పుకొస్తున్నారు.

దీని గురించి ఓ టిప్‌స్టర్ కొన్ని వివరాలు వెల్లడించారు. OnePlus 13 ఫోన్‌లో 24 GB వరకు RAM ఉండవచ్చని చైనా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ Weiboలోని ఒక పోస్ట్‌లో వెల్లడైంది. కాగా ఇది ఎక్కువ మెమరీని కలిగి ఉండటం వలన AI ఆధారిత ఫీచర్లు, గేమింగ్ పనితీరు మెరుగుపడుతుందని చెప్పబడింది. అంతేకాకుండా గేమింగ్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో మరిన్ని యాప్‌లను ఓపెన్ చేసి ఉంచడానికి కూడా పాజ్‌బులిటీ ఉంది.


Also Read: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

అయితే OnePlus 13 ఫోన్‌లో కంటే ముందే Asus ROG Phone 8, OnePlus Ace 3 Pro, Redmi K70 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ టాప్ వేరియంట్‌లు 24 GB RAM, 1 TB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. అయితే వీటిలో 24 GB RAM వేరియంట్‌లు కేవలం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో టాప్ వేరియంట్‌లు కేవలం 16 GB RAMకి పరిమితం చేయబడ్డాయి. ఇదిలా ఉంటే ఇటీవల OnePlus 13 టీజర్‌ అందించారు. దాని ప్రకారం.. ఇందులో Snapdragon 8 Gen 4ని ప్రాసెసర్‌గా అందించారు.

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 స్క్రీన్ 2K రిజల్యూషన్‌తో ఉంటుంది. ఇది 50 మెగాపిక్సెల్ LYT-808 ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో అందించబడుతుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 100 W వైర్డ్, 50 W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కాగా ఇటీవల OnePlus భారతదేశంలో Nord Buds 3ని లాంచ్ చేసింది.

ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌ల బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్ పై 43 గంటల వరకు పని చేస్తుంది. 36 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వరకు మద్దతునిస్తాయి. 12.4 mm టైటానియం డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. నార్డ్ బడ్స్ 3 రూ.2,299 ధరతో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రెండు రంగులలో లభిస్తాయి. మెలోడిక్ వైట్, హార్మోనిక్ గ్రే వంటివి ఉన్నాయి

Related News

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

Flipkart Big Billion Days Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

iPhone 13 Price Cut: ఉఫ్ ఉఫ్.. చెమటలు పట్టించే ఐఫోన్ ఆఫర్, చాలా తక్కువకే కొనేయొచ్చు!

NASA Records Black hole Sound: అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లపై ఊహకందని డిస్కౌంట్లు!

Big Stories

×