EPAPER

Nokia 108 4G Nokia 125 4G : పిచ్చెక్కిస్తున్న నోకియా 4G ఫోన్స్ ఫీచర్స్.. స్నేక్ గేమ్‌, MP3 ప్లేయర్‌, FM రేడియోతో స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!

Nokia 108 4G Nokia 125 4G : పిచ్చెక్కిస్తున్న నోకియా 4G ఫోన్స్ ఫీచర్స్.. స్నేక్ గేమ్‌, MP3 ప్లేయర్‌, FM రేడియోతో స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!

Nokia 108 4G Nokia 125 4G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా… రెండు 4G ఫీచర్‌ ఫోన్స్ ను ఆవిష్కరించింది. నోకియా 108 4G (2024), నోకియా 125 4G (2024) పేరుతో  లాంఛ్ అయిన ఈ మెుబైల్స్ లో స్పెషల్ ఫీచర్స్ తో పాటు దాదాపు 2వేల వరకూ కాంటాక్స్ సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం తక్కువ రేటుకే బెస్ట్ 4G మెుబైల్స్ కొనాలనుకునే కస్టమర్స్ ఓ సారి ట్రై చేసేయండి.


నోకియా… తాజాగా లాంఛ్ చేసిన మెుబైల్స్ హై ఫీచర్స్ తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్స్ లో ఎంతో పాపులర్‌ అయిన Snake గేమ్‌ను ఇన్బిల్ట్ అయి ఉంది. ఈ ఫీచర్‌ ఫోన్స్ లో 2 అంగుళాల డిస్‌ప్లే, వైర్‌ లెస్‌ FM రేడియో, MP3 ప్లేయర్‌,  2000 వరకు కాంటాక్ట్‌లను సేవ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇక ఇతర ఫీచర్స్ సైతం అదిరిపోయోలా ఉన్నాయి.

ఇక నోకియా 125 4G ఫీచర్‌ ఫోన్‌… నోకియా తాజాగా తీసుకువచ్చిన 110 4G ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అదే నోకియా 108 4G స్మార్ట్‌ఫోన్‌.. HMD 105 4G ఫోన్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వచ్చింది.


Nokia 108 4G –

స్పెసిఫికేషన్‌లు – ఈ ఫోన్‌ 2 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2వేల కాంటాక్ట్‌లను సేవ్‌ చేసేందుకు అవకాశం ఉంది. నోకియా పాపులర్‌ Snake Game ఉంది. 108 4G ఫోన్‌ 128MB RAM, 64MB స్టోరేజీతో లాంఛ్ అయింది. మైక్రో SD కార్డుతో స్టోరేజ్ ను మరింత పెంచుకొనే అవకాశం ఉందని నోకియా తెలిపింది. వైర్‌,  వైర్‌లెస్‌ FM రేడియో, MP3 ప్లేయర్‌, వాయిస్‌ రికార్డర్‌,  డ్యూయల్‌ ఫ్లాష్‌ లైట్స్ ఇందులో ఉన్నాయి. 1450mAh బ్యాటరీ, సింగిల్ ఛార్జింగ్ తో 15 రోజుల స్టాండ్‌బై ఉంటుందని నోకియా తెలిపింది. ఈ ఫోన్‌ బ్లాక్‌, సియార్‌ రంగుల్లో రానుంది.

Nokia 125 4G –

స్పెసిఫికేషన్స్ –  ఈ ఫోన్‌ 2 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. MP3 ప్లేయర్‌, వైర్‌లెస్‌ FM రేడియో,వాయిస్‌ రికార్డర్‌, డ్యూయల్‌ ఫ్లాష్‌ లైట్‌, వైర్‌తో లాంఛ్ అయింది. ఈ ఫోన్‌ 1000mAh బ్యాటరీను కలిగి ఉంది. ఇక ఇందులో కూడా 2వేల వరకూ కాంటాక్ట్‌లు సేవ్‌ చేసుకునే అవకాశం ఉంది.  నోకియా చెబుతోంది. 128MB RAM, 64MB స్టోరేజీతో లాంఛ్ అయింది. మైక్రో SD కార్డుతో స్టోరేజ్ ను మరింత పెంచుకొనే అవకాశం ఉందని నోకియా తెలిపింది. పాపులర్ స్నేక్ గేమ్ తో లాంఛ్ అయిన ఈ నోకియా ఫోన్‌ బ్లూ, టైటానియం రంగుల్లో లభించనుంది.

ఈ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ బయటకు లీక్ చేసిన నోకియా కంపెనీ.. ధర మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ ఫోన్స్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో… ఎప్పటి నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందో కూడా చెప్పలేదు. ఈ ఫోన్స్ పై మరింత అప్డేట్ త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అందుబాటు ధరలలోనే మెుబైల్స్ ధరలు ఉంటాయని, త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని మాత్రం టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ :పిచ్చెక్కిస్తున్న నోకియా 4G ఫోన్స్ ఫీచర్స్.. స్నేక్ గేమ్‌, MP3 ప్లేయర్‌, FM రేడియోతో స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!

 

 

Related News

Poco F7 Poco F7 Pro : పోకో నా మజాకా.. కిర్రాక్ ఫీచర్స్ తో మరో రెండు ఫోన్స్ లాంఛ్.. కెమెరా ఫీచర్స్ అదిరిపోయాయంతే!

Jio Entertainment Plans : OTTని షేక్ చేసే బెస్ట్ జియో ప్లాన్స్ ఇవే… ఏ ధరకు ఏ ఫ్లాట్మామ్స్ అంటే!

Types Of Hackers : బాబోయ్.. హ్యాకర్స్ లో ఎన్ని రంగులో.. ఒకరు చేసిన పని మరొకరు చేయరా.. దిమ్మతిరిగే నిజాలివే!

Best Smart Phones Under 25000 : మెుబైల్స్ జాతర.. మరికొద్ది రోజులే.. ఆఫర్స్ వదిలారో మరి దొరకవ్

Smart Tv Offers : సూపర్ డూపర్ సేల్ గురూ.. 5G మెుబైల్ ధరకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు..

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

×