Big Stories

New Galaxy Named GS 9209 : 25 మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో కొత్త గ్యాలక్సీ గుర్తింపు..

New Galaxy Named GS 9209

New Galaxy Named GS 9209 : అంతరిక్షంలోని కొత్త కొత్త విషయాలను, మిస్టరీలను ఆస్ట్రానాట్స్ ఎప్పటికప్పుడు శోధిస్తూనే ఉన్నారు. అయినా కూడా వారికి తెలియని మరెన్నో కొత్త విషయాలు అంతరిక్షంలో దాగి ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయం ఆస్ట్రానాట్స్‌కు కూడా తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు తమ పరిశోధనల తీరును మారుస్తూ కొత్త విషయాలను కనుక్కోనే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆ పరిశోధనల్లో భాగంగా వారు ఒక కొత్త గ్యాలక్సీనే కనుగొన్నారు.

- Advertisement -

ఇప్పటివరకు ఎప్పుడూ ఉపయోగించని ఒక పవర్‌ఫుల్ టెలిస్కోప్ సాయంతో 25 మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక కొత్త గ్యాలక్సీని ఆస్ట్రానాట్స్ ఇటీవల కనిపెట్టారు. ఇలాంటి టెలిస్కోప్ ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేదని వారు చెప్తున్నారు. ఈ గ్యాలక్సీని జీఎస్ 9209 అంటారని తెలుస్తోంది. ఇది దాదాపు బిగ్ బ్యాంగ్ సమయంలో ఫార్మ్ అయ్యింటుందని ఆస్ట్రానాట్స్ అంచనా. అంటే ఈ గ్యాలక్సీ ఏర్పడి దాదాపు 600 నుండి 800 మిలియన్ సంవత్సరాలు అయ్యిండవచ్చు.

- Advertisement -

జీఎస్ 9209 అనే గ్యాలక్సీని శాస్త్రవేత్తలు కనుగొన్న తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో దానిలోని ప్రాపర్టీలను కనుగొనే ప్రయత్నం చేశారు. ఇప్పటికే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో ఎన్నో కొత్త గ్రహాలను ఆస్ట్రానాట్స్ కనిపెట్టగలిగారు. గత కొన్నేళ్లుగా ఆస్ట్రానాట్స్ కనిపెడుతున్న గ్యాలక్సీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. కాస్మిక హిస్టరీలో చెప్పినదానికంటే ప్రస్తుతం అంతరిక్షంలో లెక్కపెట్టలేనన్ని గ్యాలక్సీలు ఉన్నాయని వారు నిర్ధారణకు వచ్చారు.

ఆస్ట్రానాట్స్ కొత్తగా కనిపెట్టిన ఈ గ్యాలక్సీలో ఒక బ్లాక్ హోల్ కూడా కనిపించడం వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మామూలుగా బ్లాక్ హోల్స్ అనేవి గ్యాలక్సీలలో ఎక్కువగా నక్షత్రాలు ఏర్పడకుండా ఉండేలా అడ్డుకుంటాయి. అందుకే అలాంటి గ్యాలక్సీలను కనుక్కోవడం అంత సులభం కాదు. జీఎస్ 9209 అనేది మిల్కీ వే కంటే 10 రెట్లు చిన్నగా ఉన్నా కూడా మన గ్యాలక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో.. ఆ గ్యాలక్సీలో కూడా అన్ని నక్షత్రాలు ఉన్నాయని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు.

ప్రస్తుతం జీఎస్ 9209 గ్యాలక్సీలో నక్షత్రాలు అనేవి ఏర్పడడం లేదని ఆస్ట్రానాట్స్ తెలిపారు. ఇలాంటి గ్యాలక్సీలను క్వీసెంట్ గ్యాలక్సీలు అంటారని చెప్పారు. ప్రస్తుతం అసలు జీఎస్ 9209లో నక్షత్రాలు ఎందుకు ఏర్పడడం లేదు అనే విషయంపై ఆస్ట్రానాట్స్ పరిశోధనలు చేస్తున్నారు. ఆ గ్యాలక్సీలో ఉన్న బ్లాక్ హోల్స్‌ను గమనిస్తే దీనికి సులువుగా సమాధానం దొరుకుందని వారు భావిస్తున్నారు. 2004లో ముందుగా ఆస్ట్రానాట్స్ జీఎస్ 9209ను కనిపెట్టారు. అప్పటినుండి ఈ గ్యాలక్సీపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News