EPAPER

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

Movie Gen AI : ఫేస్ బుక్ మాతృ సంస్ధ మెటా ఇప్పటి వరకు చాట్‌బాట్‌, ఫొటో జనరేషన్‌ సేవలకు మాత్రమే పరిమితం అయింది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త మోడల్ ను ప్రవేశపెడితూ వీడియో జనరేషన్ సదుపాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. మూవీ జెన్‌ ఏఐ (Movie Gen AI)  పేరిట కొత్త సాంకేతికతను  అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ వీడియో జనరేషన్ స్టార్టప్  చాట్‌జీపీటీ, లెవన్‌ల్యాబ్స్‌ వంటి ప్రముఖ వీడియో జనరేషన్‌ స్టార్టప్‌లకు పోటీగా నిలవనుంది.


మెటా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారంగా టెక్ట్స్‌ సాయంతో వీడియోలు, ఆడియో క్లిప్‌లు రూపొందించే కొత్త సాంకేతిక మూవీ జెన్‌ ఏఐ (Movie Gen AI) ను ప్రవేశపెట్టింది. దీని సాయంతో వీడియోలు నచ్చిన విధంగా జనరేట్ చేయవచ్చు. కావల్సిన వీడియోలు టెక్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ప్రతీ విషయాన్ని డీటైల్డ్ గా చెప్తే చాలు… 16 సెకండ్లలోనే  వీడియోను అందిస్తుంది. ఇక 45 సెకండ్ల పాటూ వీడియో, ఆడియో ను పొందే అవకాశం ఉంటుంది. ఇక వీడియోను జనరేట్ చేయడంతో పాటు ఇచ్చిన కంటెంట్ కు తగినట్టుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ సైతం మూవీ ఏఐ జెన్ లో జోడించింది. ఈ విషయాన్ని తన బ్లాక్ లో పోస్ట్ చేస్తూ దీనికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది. ఈ సాంకేతికత ప్రాముఖ్యతను వివరించింది.

ఈ ఏఐ సాంకేతికత తో ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అదే విధంగా వీడియోను రూపొందించవచ్చు. కావలసిన విధంగా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ చెప్తే నచ్చిన విధంగా వీడియోను క్రియేట్ చేసి ఇస్తుంది.  ఇచ్చిన టెక్స్ట్ కు తగినట్టుగా వీడియోకు ఎఫెక్ట్స్ సైతం అందిస్తుంది. అయితే ఈ సాంకేతికతను ప్రత్యక్ష వినియోగానికి అందుబాటులోకి తేలేదని స్పష్టం చేసింది. పెరిగిపోతున్న సైబర్ నేరాలు, సాంకేతిక సమస్యలతో దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని.. ఖచ్చితంగా రిస్క్ ఎదురయ్యే అవకాశం ఉందని.. అందుకే ఎంటర్టైన్మెంట్ కమ్యూనిటీకి మాత్రమే ఈ టెక్నాలజీ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చింది.


ALSO READ : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

ఎంటర్టైన్మెంట్ కమ్యూనిటీ, కంటెంట్ క్రియేటర్స్ తో కలిసి నేరుగా కనెక్ట్ అయ్యి పనిచేస్తామని మెటా తెలిపింది. ఈ సాంకేతికతపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని.. పూర్తి స్థాయిలో  అందుబాటులోకి వచ్చే ఏడాది తీసుకొస్తామని తెలపింది.

ఇక ఈ సాంకేతికతతో మెటా.. హాలీవుడ్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే హాలీవుడ్ సినిమాల్లో మరింత గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మెటా పలువురు హాలీవుడ్ డైరెక్టర్స్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే పూర్తి గా ఏ విషయం డిసైడ్ కాలేదని మరింత మెరుగ్గా ఇందులో సేవలను వినియోగించుకోవాలంటే సాంకేతికతను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీంతో ఫిల్మ్ క్రియోటర్స తమ పనిని మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా రాబోయో కాలమంతా ఆర్టిఫిషియల్ సాంకేతికతపై ఆధారపడి ఉండనున్నట్లే తెలుస్తుంది.

 

Related News

iPhone SE 4 : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

Airtel Xstream AirFiber : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

×