Big Stories

Netflix : పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కఠిన చర్యలు..

Netflix : ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఇప్పుడు థియేటర్ బిజినెస్‌నే దెబ్బతిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. చాలావరకు తక్కువ బడ్జెట్ సినిమాలు, రిలీజ్ అవ్వగానే ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీ వల్లే ఎంతోకొంత ఆధరణను పొందగలుగుతున్నాయి. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా తమ బిజినెస్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది.

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్ అనేది ఇన్ని స్క్రీన్స్‌కు ఇంత ఖరీదు అని బిజినెస్‌ను మొదలుపెట్టింది. కానీ యాజమాన్యానికి తెలియకుండానే పాస్‌వర్డ్ షేర్ చేసుకుంటూ ఒక్కొక్క నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను చాలామంది ఉపయోగించడం మొదలుపెట్టారు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ దృష్టిపెట్టింది. యాజమాన్యం అనుమతి లేకుండా పాస్‌వర్డ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవని అంటోంది నెట్‌ఫ్లిక్స్. అకౌంట్ హోల్డర్ తన కుటుంబంతో కాకుండా బయట వ్యక్తితో పాస్‌వర్డ్ షేర్ చేస్తే.. దానికి వారు నష్టపరిహారం అనుభవించాల్సి వస్తుందని బయటపెట్టింది.

- Advertisement -

ఒక నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఒక ఇంట్లో మాత్రమే ఉపయోగించవచ్చు. ఒకప్పుడు పాస్‌వర్డ్ షేరింగ్ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇంత కఠినంగా ఉండేది కాదు. కానీ గత కొన్ని నెలలుగా నెట్‌ఫ్లిక్స్ రెవెన్యూ చాలావరకు తగ్గిపోయింది. దీనికి కారణం పాస్‌వర్డ్ షేరింగ్ అని యాజమాన్యం తెలుసుకుంది. అదే సమయంలో ఇతర ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లాభాల విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ను దాటేసి ముందుకు వెళ్లాయి. అందుకే పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుంది.

103 దేశాల్లో పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకుంటున్న యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈమెయిల్స్ పంపి హెచ్చరించింది. యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, జెర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్.. ఇలా చాలా దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు ఈ ఈమెయిల్స్ వెళ్లాయి. తమ కుటుంబంలో వ్యక్తి కాకుండా మరొకరికి పాస్‌వర్డ్ షేర్ చేయాలి అని యూజర్ అనుకుంటే దానికోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్‌ను కొనాల్సి ఉంటుందని యాజమాన్యం చెప్తోంది. దానికోసమే పెయిడ్ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం పాస్‌వర్డ్ షేర్ చేయాలనుకునే కస్టమర్లు ఎంతోకొంత మొత్తాన్ని కట్టవలసి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News