EPAPER

Hanooman AI Model: చాట్ జీపీటీ తరహాలో భారత్ జీపీటీ.. రిలయన్స్ నుంచి ‘హనుమాన్’ ఏఐ

Hanooman AI Model: చాట్ జీపీటీ తరహాలో భారత్ జీపీటీ.. రిలయన్స్ నుంచి ‘హనుమాన్’ ఏఐ

Chat GPT Model Bharat GPT in India : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI). ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే. మనిషి చేసే పనిని వేగంగా పూర్తి చేస్తుందని, ఏ ప్రశ్నకైనా త్వరగా సమాధానం చెబుతుందని అందరూ ఏఐ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రాగా.. ఇందులో భారత్ కూడా కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తుంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వివిధ ఐఐటీ కంపెనీల సమన్వయంతో ఏర్పాటైన భారత్ జీపీటీ (Bharat GPT) మార్చిలో చాట్ జీపీటీ (chatGPT) తరహా సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ను స్నీక్ పీక్ కన్సార్టియం మంగళవారం ముంబైలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో ప్రదర్శించింది.


లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పనితీరును తెలియజేసే వీడియోను భారత్ జీపీటీ ప్రేక్షకుల ముందుంచింది. ఏఐ బాట్ తో ఒక వ్యక్తి తమిళంలో మాట్లాడి సమాధానం రాబట్టారు. ఒక బ్యాంక్ ఉద్యోగి హిందీలో చాట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. కంప్యూటర్ కోడ్ ను రాసేందుకు ఉపయోగించారు. రిలయన్స్ ఆవిష్కరించిన ఈ మోడల్ కు హనుమాన్ (Hanooman)గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

Read More:  గగన్‌యాన్ కోసం ఇంజన్ పరీక్షలు సక్సెస్..!


ఇది మొత్తం 11 స్థానిక భాషల్లో పనిచేస్తుందని సమాచారం. ఆరోగ్య సంరక్షణ, గవర్నెన్స్, ఆర్థిక సేవలు, విద్యారంగాల్లో సేవల్ని అందించనుంది. ఐఐటీలతో పాటు.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారత ప్రభుత్వ సహకారంతో దీనిని రూపొందించారు. ఐఐటీలతో పాటు రిలయన్స్ ఇన్ఫోకామ్, భారత ప్రభుత్వం సహకారంతో దీనిని రూపొందించారు. ఇందులో హనుమాన్ స్పీచ్ టు టెక్ట్స్ వంటి సేవల్ని అందిస్తున్నట్లు ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి గణేశ్ రామకృష్ణన్ వెల్లడించారు. దీని ఆధారంగా ప్రత్యేక అవసరాలకు కావలసిన మోడల్స్ ను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తుందన్నారు. రిలయన్స్ తమ సబ్ స్కైబర్లకు ఏఐ సేవల్ని అందించేందుకు జియో బ్రెయిన్ పేరుతో ఒక మోడల్ ను తయారు చేస్తోంది. అలాగే భారత్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. సర్వం, కృత్రిమ్ వంటి అంకుర సంస్థలు సైతం ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయి.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×