EPAPER

Motorola Edge 50 Ultra: మోటో నుంచి వేరే లెవల్ ఫోన్.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫీచర్లు.. మామూలు స్కెచ్ కాదిది..!

Motorola Edge 50 Ultra: మోటో నుంచి వేరే లెవల్ ఫోన్.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫీచర్లు.. మామూలు స్కెచ్ కాదిది..!

Motorola Edge 50 Ultra Launch: మోటరోలా తన బ్రాండ్‌కు చెందిన పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 18న భారతదేశంలో విడుదల చేయనుంది. హై-ఎండ్ డివైజ్‌ని కొంతకాలం క్రితం గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేశారు. ఈ క్రమంలో స్పెసిఫికేషన్, ధర కూడా వెల్లడైంది. గ్లోబల్ వేరియంట్ ఉన్నట్లుగా కంపెనీ ఈ ఫోన్‌ను భారతదేశంలో కూడా లాంచ్ చేయనుంది. కాబట్టి ఈ ఫోన్‌ను దేశంలో లాంచ్ చేయడానికి ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.


ఈ మోటరోలా ఫోన్‌లో ఉన్న అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే ఇందులో కనిపించే కొత్త వుడ్ బ్యాక్ డిజైన్. అంటే బ్యాక్ చెక్కతో తయారు చేయబడిన ప్యానెల్ ఇచ్చారు. ఇది ఫోన్‌‌కు మరింత లుక్ ఇస్తుంది. వేగన్ లెదర్ డిజైన్‌లో కూడా రానుంది. ఇది మూడు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఇందులో వేగన్ లెదర్ వేరియంట్‌ల కోసం ఫారెస్ట్ గ్రే, పీచ్ ఫడ్జ్, వుడ్ ఉపయోగించే నార్డిక్ వుడ్ ఉన్నాయి. మూడు వేరియంట్‌లు శాండ్‌బ్లాస్టెడ్ అల్యూమినియం ఫ్రేమ్‌లతో వస్తాయి.

మోటరోలా Edge 50 అల్ట్రా 6.7-అంగుళాల LTPS పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ప్యానెల్ 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+ సపోర్ట్, 93.8 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో కలిగి ఉంది. 2,500 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే పాంటోన్ సర్టిఫికేషన్ పొందింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ ఉంటుంది.


Also Read: బడ్జెట్ ధరలో ఒప్పో నుంచి మరో రేసు గుర్రం.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.. ఇవాళే లాంచ్!

స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8s Gen 3 SoC చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 16GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌‌లో 4,500mAh బ్యాటరీ 125W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది.

ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో లేజర్ ఆటో ఫోకస్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది OIS సపోర్ట్, 3x ఆప్టికల్ జూమ్‌తో 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో లింక్ చేయబడిన OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉంది. అలానే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Also Read: అబ్బా కుమ్మేశారు.. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌లో ఇన్ని ఆఫర్లా.. భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరలోనే..!

మోటరోలా Edge 50 అల్ట్రాలో ఆడియో కోసం డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేయబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ సౌండ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌ల కోసం లాస్‌లెస్ ఆడియోను ఎనేబుల్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ సపోర్ట్, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, NFC ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 OSలో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది.

మోటరోలా జూన్ 18, 2024న మధ్యాహ్నం 12 గంటలకు Edge 50 అల్ట్రాను భారతదేశంలో లాంచ్ చేయనుంది. భారతీయ మోడల్ ధర ఇంకా వెల్లడికాలేదు. చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర 999 యూరోలు. కాబట్టి భారతదేశంలో దీని ధర దాదాపు రూ. 70,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

Tags

Related News

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Big Stories

×