EPAPER

Motorola Razr 40 Ultra Price Cut: ఉఫ్ ఉఫ్.. ఫ్లిప్‌ ఫోన్‌పై రూ.50,000 భారీ డిస్కౌంట్.. ఫీచర్లు కుమ్మేసాయ్..!

Motorola Razr 40 Ultra Price Cut: ఉఫ్ ఉఫ్.. ఫ్లిప్‌ ఫోన్‌పై రూ.50,000 భారీ డిస్కౌంట్.. ఫీచర్లు కుమ్మేసాయ్..!

Motorola Razr 40 Ultra Price Cut: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ జూలై 20 నుండి ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్‌ను భారతదేశంలో ప్రారంభించనుంది. ఈ డీల్‌లో చాలా ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. ముఖ్యంగా ఆకర్షణీయమైన డీల్‌లు స్మార్ట్‌ఫోన్‌లపై ఉన్నాయి. అందులో మోటో ప్రీమియం ఫోన్ ఒకటుంది. మోటో కంపెనీకి చెందిన Motorola Razr 40 Ultra స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ Motorola ప్రీమియం ఫ్లిప్ ఫోన్‌ను అసలు ధరపై రూ.50,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.


Motorola భారతదేశంలో కొత్త Razr 50 Ultraని రూ.1,19,999కి విడుదల చేసింది. ఇది మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో బ్లూ, బ్లాక్, వివా మెజెంటా, పింక్ వంటి కలర్‌లలో లభిస్తుంది. కొత్త Razr 50 Ultra మెరుగైన ఫీచర్లు, హార్డ్‌వేర్‌లను తీసుకువస్తున్నప్పటికీ.. Razr 40 Ultra ఇప్పటికీ మంచి ఫోన్. అందువల్ల ఎప్పుడైనా ఫ్లిప్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే Motorola Razr 40 Ultra మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ డేకి ముందు, Motorola Razr 40 Ultra అసలు ధర రూ.1,19,999కి అమెజాన్‌‌లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తుంది. అంటే వాస్తవ ధరపై దాదాపు రూ.50,000 తగ్గింపును పొందొచ్చు. అలాగే Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ICICI బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ధరపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ప్రైమ్ డే సేల్‌కు ముందు మోటరోలా రేజర్ 40 అల్ట్రాపై అమెజాన్ మరిన్ని ఆఫర్‌లను వెల్లడించే అవకాశం ఉంది.


Also Read: వావ్ ఇలాంటి ఫోన్ ఎప్పుడైనా చూశారా.. త్వరలో వచ్చేస్తుంది.. స్పెసిఫికేషన్లు అదుర్స్!

Motorola Razr 40 Ultra Specifications

Motorola Razr 40 Ultra స్మార్ట్‌ఫోన్ HDR10+ మద్దతుతో 6.9-అంగుళాల పూర్తి-HD+ LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1400 nits గరిష్ట ప్రకాశం, 165Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. దీని కవర్ డిస్‌ప్లే 3.6 అంగుళాలుగా పోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 1100-నిట్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

గరిష్టంగా 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. Razr 40 అల్ట్రా ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది.. కానీ ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ చేయబడుతుంది. దీని వెనుక కెమెరాలలో 12MP, 13MP సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరాలో 32MP సెన్సార్ ఉంటుంది. Razr 4 Ultraలో స్టీరియో స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇది 30W వైర్డ్.. 5W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 3800mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×